ఆ ఇద్దరూ అయిపోయారు.. ఇప్పుడు మెహబూబ్, సోహెల్.. అఖిల్‌ను వదలని అభిజిత్
బిగ్ బాస్ తాను ఆడించే ఆటను ఎలా కావాలంటే అలా తిప్పుతాడు. ఒక దారిలో వెళ్తోన్న ఆటను యూటర్న్ తిప్పించి తనకు నచ్చేలా గొడవలు పెరిగేలా మనుషుల మధ్యన దూరాలు పెరిగేలా కూడా చేస్తాడు. అందులో భాగమే అఖిల్‌ను సీక్రెట్ రూంకి పంపిండం. సీక్రెట్ రూంలోకి వెళ్లిన అఖిల్.. అందర్నీ గమనించడం, అందరి రంగులు ఏంటో తెలుసుకుని మళ్లీ బయటకు వస్తాడు. అప్పుడు అసలైన ఆట మొదలవుతుందని బిగ్ బాస్ ప్లాన్.

అఖిల్ సీక్రెట్ రూంలోకి..
ఇంటి సభ్యులందరూ కలిసి అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి ఇంటి నుంచి బయటకు పంపారు. వారి దృష్టిలో అది బయటకు అయినా ప్రేక్షకుల దృష్టిలో అది సీక్రెట్ రూం. అయితే అఖిల్ సీక్రెట్ రూంలోకి వెళ్లిన తరువాత అభిజిత్ మాటల్లో,చేతల్లో తెలియని మార్పు కనిపిస్తోంది.

హారిక, లాస్యలతో..
అఖిల్ బయటకు వెళ్లిన క్షణం నుంచి అభిజిత్ అదే టాపిక్‌పై చర్చించాడు. తన స్నేహితులు, గ్యాంగ్ మేట్స్ అయిన లాస్య, హారికలతో మాట్లాడాడు. అలా ఎలా చేస్తాడు? వాదించుకోవాలి కదా? ఇమ్యూనిటీ కోసం అంత చేసినోడు అలా ఎలా వెళ్లిపోతాడు అని లాస్య, హారికలతో ముచ్చట్లు పెట్టాడు.

తాజాగా ఆ ఇద్దరితోనూ..
ఇక తాజాగా మెహబూబ్, సోహెల్‌తోనూ అదే విషయాన్ని అభిజిత్ ప్రస్తావించినట్టు కనిపిస్తోంది. ఆ బాల్‌ను కొట్టింది ఎవరు? అలా ఎలా చేస్తాడు అంటూ మెహబూబ్, సోహెల్‌తో ముచ్చటించాడు. ఇమ్యూనిటీ కోసం ఫైట్ చేసిన వాడు.. నిన్న వెళ్లకుండా ఉండేందుకు కూడా వాదించాలి కదా ఎందుకు వాదించలేదని సోహెల్, మెహబూబ్‌లతోనూ చర్చించాడు.
వేరే విషయమే లేదా?
అయితే అభిజిత్ ప్రతీసారి అదే టాపిక్ మాట్లాడుతూ ఉండటం, అఖిల్‌ను ఏదో విధంగా బ్యాడ్ చేద్దామనే ఉద్దేశ్యంలో అభిజిత్ అలా మాట్లాడుతోన్నట్టు కనిపిస్తోంది. ఇలా అభిజిత్ అఖిల్ గురించి మాట్లాడుతూ బ్యాడ్ అవుతూ ఉంటే.. సీక్రెట్ రూంలోఉన్న అఖిల్ ప్రతీ సారి కౌంటర్లు వేస్తూ అలా బ్యాడ్ అవుతున్నాడు. అసలు అఖిల్ బయటకు వచ్చాక ఏం చేస్తాడు? కథ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











