ఒక్క హగ్గుతో మ్యాటర్ క్లోజ్ చేసేశారు.. అభిజిత్-హారిక రిలేషన్ గట్టిగానే ఉంది!!
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో అభిజిత్ హారికల స్నేహబంధం మొదటి నుంచి గట్టిగానే ఉంది. మొదటి రెండు వారాల్లో వీరిద్దిర బంధంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ప్రతీ విషయంలో అభిజిత్‌కు అండగా హారిక గొంతెత్తడం, అడ్డుగా ఉంటూ మద్దతు తెలిపేది. అభిజిత్ మోనాల్‌తో ఉండటం, స్వాతితో క్లోజ్ అవ్వడంలాంటి కొన్ని విషయాల్లో హారిక హర్టైంది. అయితే మళ్లీ వెంటనే దగ్గరైపోయారు.

విడగొట్టే ప్రయత్నం..
మామూలుగా బిగ్ బాస్ ఇలాంటి వారిని విడగొట్టే ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక టాస్క్ ఇచ్చి ఇద్దరి మధ్య దూరాన్ని, లేదా ఏ ఇద్దరి మధ్య ప్రేమను పుట్టించే ప్లాన్‌లు వేస్తుంటాడు. ఇందులో భాగంగానే కనెక్షన్ గేమ్ ద్వారా హారిక అభిజిత్ దగ్గరయ్యారు. టమోటా పల్ప్ టాస్క్ ద్వారా అఖిల్ మోనాల్ దగ్గరయ్యారు.

హోటల్ టాస్క్‌లో అలా..
ఐదో వారంలో బిగ్ బాస్ హోటల్ టాస్క్‌లో హారిక, అభిజిత్‌నే సపరేట్ చేశాడు. ఇద్దరినీ చెరో టీంలో వేసేశాడు. అనుకున్నట్టుగానే వీరిద్దరి మధ్య గొడవ కూడా మొదలైంది. స్టార్ రేటింగ్స్ విషయంలో అభిజిత్ హారికల మధ్య మనస్పర్థలు వచ్చాయి.

కంటతడి కూడా..
తాను ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చానని, అది మాత్రమే లెక్కలోనికి తీసుకోవాలని హారిక బిగ్ బాస్‌కు చెబుతూ కన్నీరు పెట్టుకుంది. అభిజిత్‌ను ఇవ్వమని అడిగినా స్టార్స్‌ను ఇవ్వలేదు. అవి ఇచ్చే వరకు మాట్లాడను అని కూడా చెప్పింది. తాను ఇష్ట పూర్వకంగా ఒక్క స్టార్ మాత్రమే ఇచ్చానని పదే పదే చెబుతూ వచ్చింది.

బిగ్ బాస్ నిర్ణయంతో అలా..
ఇక టాస్క్ ప్రకారం బిగ్ బాస్ గెస్ట్‌ల టీం గెలుపుపొందిందని ప్రకటించాడు. వారు ఇష్టపూర్వకంగా ఇచ్చిన స్టార్స్ మాత్రమే లెక్కలోనికి వస్తాయని ప్రకటించడం అభి వేసిన ప్లాన్ బెడిసికొట్టింది. అయితే బిగ్ బాస్ అలా ప్రకటించిన వెంటనే అభి హారిక వద్దకు వచ్చి సారీ చెప్పాడు.
Recommended Video

గట్టిగా హత్తుకుని..
టాస్క్ వల్ల ఏర్పడిన మనస్పర్థలు తొలగించుకున్నారు. మంచిగా ఆడావ్ అంటూ అభిని హారిక పొగిడింది కూడా. ఇక ఇద్దరూ ఘాడంగా హత్తుకున్నారు. అభిజిత్ హారికను ప్రేమగా తలపై నిమిరాడు. మొత్తానికి ఇలా హగ్గుతో ఏకమయ్యారు. మళ్లీ యథావిథిగా కలిసిపోయారు. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలని, వారి బంధం గట్టిగానే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











