అభిజిత్‌తో అరియానా.. మోనాల్‌తో అవినాష్‌.. కథ అడ్డం తిరుగుతోందా?

అపార్థం చేసుకోవాలన్నా, ఆప్యాయతలు పెంచుకోవాలన్నా బిగ్ బాస్ షోలో ఒక్క క్షణం, ఒక్క చిన్న మాట చాలు. నాలుగు గోడల మధ్యే బంధించడం వల్ల వారికి చిన్న చిన్న విషయాలే పెద్దవిగా కనిపిస్తుంటాయి. ఎవరు ఎప్పుడు క్లోజ్‌గా ఉంటారో.. ఎప్పుడు విడిపోతారో చెప్పలేం. ప్రస్తుతం ఇంట్లో మాత్రం కథలన్నీ రివర్స్ అవుతున్నాయి. ఎవరు ఎటు వైపు ఉన్నారు.. ఎవరు ఎవరికి దగ్గరవుతాన్నారో చెప్పడం కష్టంగా మారింది.

మొదట అలా..

మొదట అలా..

బిగ్ బాస్ షో మొదటి వారంలో అభిజిత్ మోనాల్ క్లోజ్‌గా ఉన్నారు. టాస్క్ వల్ల మధ్యలో అఖిల్‌కు దగ్గరైంది. అలా ఆ ఇద్దరితో బాగానే నడిపించింది మోనాల్. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అవినాష్.. మోనాల్‌కు లైన్ వేసే ప్రయత్నం చేశాడు. అయితే అది కామెడీగానే అయినా కూడా రాను రాను అదే సీరియస్ అయ్యేలా కనిపిస్తోంది.

తాజాగా ఇలా..

తాజాగా ఇలా..


ఐదో వారంలో జరిగిన రచ్చతో మోనాల్‌తో రిలేషన్ కట్ చేసుకుని దూరంగా ఉండిపోయాడు అభిజిత్. ఇక మోనాల్ పగలంతా అఖిల్‌తో మాట్లాడుతూ ఉండేది. రాత్రంతా అభిజిత్‌తో మాట్లాడేది. కానీ ఇప్పుడు అభిజిత్ దూరంగా ఉండటంతో అవినాష్ కాస్త దగ్గరయ్యాడు. ఇలా ఈ ఇద్దరూ కాస్త క్లోజ్ అవుతున్నారు.

అరియానా ఆగడం లేదు..

అరియానా ఆగడం లేదు..

ఐదో వీకెండ్‌లో టాస్క్‌లో భాగంగా డ్యాన్స్ చేసేందుకు అభి అరియానాను ఎంచుకున్నాడు. అక్కడే అరియానా ఫ్లాట్ అయిపోయింది. దాని తరువాత కేక్ తినిపించడం, హగ్ చేసుకోవడం ఇలా అరియానా అభి నుంచి బాగానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

నిన్నటి ఎపిసోడ్‌లో..

నిన్నటి ఎపిసోడ్‌లో..


ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఆడవాళ్లంతా నైట్ పార్టీ చేసుకున్నారు. ఇందులో అభిజిత్‌ను అరియానా బాగానే ఆడుకుంది. ఎవరితో డేట్‌కు వెళ్తావ్ అని అడగడం, నీతోనే అంటూ అభి సమాధానం చెప్పడంతో అరియానా గాల్లో తేలిపోయింది. అంతకు ముందు నువ్ బాగున్నావ్ అని అభి కాంప్లిమెంట్ ఇస్తే.. ఐ లైక్ యూ అని అరియానా అనేసింది. అలా అరియానా అభితో క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తోంది.

Recommended Video

Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
అర్ధరాత్రి రచ్చ..

అర్ధరాత్రి రచ్చ..


అవినాష్ మోనాల్ మధ్య కనెక్షన్ బాగానే సెట్ అయినట్టుంది. అర్దరాత్రి సాల్సా డ్యాన్సులు వేస్తూ మరీ రెచ్చిపోయారు. ఓ ప్రియా ప్రియా అంటూ పాటలు పాడుకుంటూ రెచ్చిపోయారు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో యూ ఆర్ మై ఎవ్రీథింగ్ అంటూ రచ్చ రచ్చ చేశారు. అసలు ఎవరు ఎవరికి దగ్గరువుతున్నారు.. ఎందుకు దగ్గరవుతున్నారో అర్థం కావడం లేదు. అయితే నాగార్జున వీటిపై ఏమైనా కామెంట్ చేస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X