జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయమిదే.. అభిజిత్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షోలో చివరి వారంలో కామన్‌గా ఓ ఎపిసోడ్ ఉంటుంది. టాప్ 5 కంటెస్టెంట్లు చివరి వారం చిల్ అయ్యేలానే బిగ్ బాస్ ప్లాన్ చేస్తాడు. వారిని ఇక కష్టపెట్టి, గొడవలు పెట్టేందుకు టాస్కులు ఏమీ పెట్టడు. అందరినీ అలా వదిలేస్తాడు. ఇక ప్రతీ సీజన్‌లో ఉన్నట్టు టాప్ 5 కంటెస్టెంట్లకు జర్నీ వీడియోను చూపిస్తాడు. వారంతా ఎమోషనల్అవుతుంటారు. అలా ప్రతీ సీజన్‌లో జరిగేదే. కానీ ఈ సారి మాత్రం స్పెషల్‌గా ఏర్పాటుచేశాడు.

నిన్న అలా..
నిన్నటి ఎపిసోడ్‌లో మాజీ కంటెస్టెంట్లను పట్టుకొచ్చి ఫన్ క్రియేట్ చేశాడు. టాప్ 5 కంటెస్టెంట్ల మదిలో మెదిలే అనుమానాలు, భయాలను పోగొట్టేందుకు గత సీజన్లలోని కంటెస్టెంట్లను గెస్ట్‌లుగా పిలిచాడు. అలా హరితేజ, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజాలు టాప్ 5 కంటెస్టెంట్లతో సరదాగా ముచ్చట్లు పెట్టారు. ఇక నేడు జర్నీలను చూపించి ఎమోషనల్ అయ్యేలా చేయనున్నాడు.

ప్రత్యేక గదిలో..
అయితే ప్రతీ సీజన్‌లో స్పెషల్ రూం ఒకటి ఏర్పాటు చేసి... అందులో టాప్ 5 కంటెస్టెంట్లకు తమ తమ జర్నీ వీడియోలను చూపించేవాడు. కానీ ఈ సారి మాత్రం అలా కాకుండా గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసినట్టు కనిపిస్తోంది. వాటిని చూసిన ఒక్కో కంటెస్టెంట్ ఎమోషనల్ అయ్యాడు.

అందరూ అలా..
అఖిల్, అభిజిత్, హారికలు తమ జర్నీ వీడియోలను చూసి ఎమోషనల్ అయ్యారు. రేపటి దినాన నేను ఉన్నా లేకపోయినా.. అలేఖ్య హారిక హిస్టరీ తీస్తే అందులో బిగ్ బాస్ మాత్రం ఉంటుందని ఎమోషనల్ అయింది. నేను ఏంది అనేది ఈ షోకు వచ్చాకే నాకు అర్థమైందని అఖిల్ ఎమోషనల్ అయ్యాడు.

ఇదే గొప్ప నిర్ణయం..
జర్నీ వీడియోను చూసిన అభిజిత్..తన లైఫ్‌లో తాను తీసుకున్న గొప్ప నిర్ణయమిదే అంటూ బిగ్ బాస్ గురించిచెప్పాడు. అయితే ఆ మధ్య మాత్రం బిగ్ బాస్‌కు వచ్చి తప్పు చేశానా? అంటూ అభిజిత్ బాగా కుమిలిపోయాడు. అందరూ కలిసి టార్గెట్ చేయడం, నామినేట్ చేస్తుండటంతో అభిజిత్ అలా రియాక్ట్ అయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది.
ఓట్లలో టాప్..
ఇప్పటి వరకు నడుస్తున్నట్రెండ్ ప్రకారం అభిజిత్‌కు ఎక్కువ ఓట్లు పడుతున్నట్టు తెలుస్తోంది. అనధికారిక పోల్స్, సర్వేలో అయితే అభిజిత్ టాప్ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే టైటిల్ విన్నర్ రేసులో ప్రధానంగా అభిజిత్ సోహెల్ అరియానాల పేర్లే వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











