మళ్లీ ఇంకో వారం అంటే భరించలేను.. అరియానా కెప్టెన్సీపై అభిజిత్ కామెంట్స్
బిగ్ బాస్ షోలో ఎనిమిదో వారం కెప్టెన్‌గా ఎన్నికైంది అరియానా. కెప్టెన్‌గా ఎన్నికయ్యే ముందు ఆమె చెప్పిన కారణాలు, చేసిన ప్రసంగం బాగానే వైరల్ అయింది. కానీ ఆమె చెప్పిన వాటికి చేసిన వాటికి పొంతనే లేకుండా పోయింది. అరియానా తన కెప్టెన్సీలో ఇంపాక్ట్ తీసుకొచ్చిందట.. తన గురించి తానే గొప్పలు చెప్పుకుంది.. మొత్తానికి తొమ్మిదో వారంలోనూ కెప్టెన్సీ పోటీకి అర్హత ఉందని చెప్పుకుంది. మిగతా వారికి చాన్స్ ఇవ్వొచ్చు అనే పాయింట్‌ను పక్కన పెట్టేసి తన స్వార్థం తానే చూసుకుంది.

ఇదే విషయంపై చర్చ..
అరియానా తన పేరును తానే చెప్పుకోవడంపై లాస్య, హారిక, అభిజిత్ అఖిల్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఎక్కువ పని చేశాడని మొదట అరియానా అవినాష్ పేరు చెబుదామని అనుకుంది.. కానీ మళ్లీ తన పేరే చెప్పుకుందని అఖిల్ పాయింట్ మాట్లాడాడు. ఆ లెక్కన తాను కూడా ఎక్కువ పని చేశాను కదా అని చెప్పుకొచ్చాడు.

చూసి ఓట్లు వేయండి..
అరియానా మళ్లీ కెప్టెన్ అవుతుందేమోనని భయపడ్డ అభిజిత్ తన గ్రూప్ మేట్స్‌కు ఓ సలహా ఇచ్చాడు. ఒకవేళ ఇంటి సభ్యుల ఓటింగ్‌ను బట్టి కెప్టెన్ అయ్యే చాన్స్ ఉంటే.. చూసి ఓట్లు వేయండని సూచించాడు. ఈమె కెప్టెన్సీ మళ్లీ ఇంకో వారం భరించాలంటే నా వల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు.


Click it and Unblock the Notifications











