బిగ్ బాస్ గెలుపు కోసం అభిజిత్ అంత ఖర్చు చేశాడా.. గెలవకపోతే ఎంత నష్టమో తెలుసా..
బిగ్ బాస్ సీజన్ 4లో గెలుపు కోసం టాప్ 5 కంటెస్టెంట్స్ మధ్య పోటీ తీవ్రత చాలా ఎక్కువయ్యిందనే చెప్పాలి. కంటెస్టెంట్స్ ఏ మాత్రం తగ్గకుండా వారి సత్తాను నీరూపించుకునేందుకు ఇదే సరైన సమయమని ఎమోషన్స్ ను పక్కనపెట్టి గట్టిగానే పోరాడుతున్నారు. అయితే అందరి ఫోకస్ కూడా ఎక్కువగా అభిజిత్ పైనే ఉంది. అతనికే ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. అయితే అభిపై ఒక రూమర్ ఇప్పుడు వైరల్ గా మారింది.

టాస్కులో ఫెయిల్ అయినా కూడా..
అభిజిత్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆడియెన్స్ ను పెద్దగా ఎట్రాక్ట్ చేయలేదు. కానీ షో గడిచిన కొద్దీ రోజుల్లోనే హౌజ్ లో అతని తీరు జనాలకు బాగా ఎక్కేసింది. ఫిజికల్ టాస్కులలో పెద్దగా యాక్టివ్ గా కనిపించకపోయినా కూడా అభి చాలా వరకు ఓవరాక్షన్ అయితే చేయలేదు. టాస్కులతో ఫెయిల్ అయినా కూడా ఓట్లు బాగానే పడ్డాయి.

అందులో మాత్రం డౌట్ లేదు
అభిజిత్ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ మాత్రం బాగానే అందుకుంటున్నాడు. అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అలా విధంగా అభికి బిగ్ బాస్ ద్వారానే జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అంతగా సక్సెస్ అవ్వలేదు. దాంతో పెద్దగా క్రేజ్ అందుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా కెరీర్ ను అలా ట్రాక్ లోకి తెచ్చుకోవాలని ప్లాన్ వెసినట్లు తెలుస్తోంది.

మిగతా వారికి.. అభికి ఉన్న తేడా అదే
బిగ్ బాస్ హౌజ్ లో అభిజిత్ ప్రతి వారం నామినేషన్ లో ఉంటూ సైలెంట్ గానే పోరాటం చేస్తున్నాడు. టాస్కులలో మిగతా కంటెస్టెంట్స్ చేసినంత ఓవరాక్షన్ అయితే అభి చేయలేదనే చెప్పాలి. చాలా వరకు కంట్రోల్ లో ఉంటూ అనవసర కోపాలకు పోకుండా గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ఎవరు ఎలాంటి నిందలు వేసినా కూడా తన సైలెన్స్ తోనే సమాధానం ఇస్తున్నాడు.

బిగ్ బాస్ కు వచ్చే ముందు.. అభి ప్లాన్
ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో మరొక టాక్ వైరల్ గా మారింది. అభిజిత్ బిగ్ బాస్ కు వచ్చే ముందే పక్కా ప్లాన్ తో ఒక టీమ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ మీడియా ద్వారా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసుకున్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి. అందుకోసం అభిజిత్ భారీగా ఖర్చు చేసినట్లుగా కూడా స్టోరీలు అల్లేస్తున్నారు.

భారిగక్ ఖర్చు.. ఒక్క రూపాయి మిగలకపోవచ్చు
ముఖ్యంగా ఒకవేళ బిగ్ బాస్ లో గెలిచే 50లక్షల డబ్బు వస్తే బయటకు వచ్చాకా ఒక్క రూపాయి కూడా మిగలదట. అంటే అభి ఖర్చు చేసింది 50లక్షలని కథనాలు వెలువడుతున్నాయి. నిజానికి అభి ఫ్యామిలీ కొంత ఉన్నతమైనదే బిగ్ బాస్ డబ్బు కూడా అతనికి పెద్ద అవసరం లేదట. కానీ నటుడిగా ఎదగాలి అంటే ఇది మంచి అవకాశం అని ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చిందట.
Recommended Video

అందులో ఎలాంటి తప్పులేదు
ఇక అందుకే అభి తల్లిదండ్రులు కూడా ఖర్చకు వెనుకాడకుండా కొడుకు కోసం ప్రమోషన్స్ చేయిస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. చాలా వరకు కంటెస్టెంట్స్ బయట ఆర్మీలను సెట్ చేసుకోవడం సహజమే. కానీ అభికి ఆ అవసరం లేదని చెప్పవచ్చు. ఉన్నా కూడా అందులో తప్పు లేదు. ఎందుకంటే బిగ్ బాస్ లో సరిగ్గా ఆడకపోతే ఎంత ప్రమోట్ చేసినా కూడా జనాలు పెద్దగా పట్టించుకోరు. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











