ఇది మామూలు ఫాలోయింగ్ కాదు.. సునామిలా పోటెత్తిన ట్వీట్లు.. అభిజిత్ హవా!
బిగ్ బాస్ షోలో అభిజిత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్నది అందరూ ఒప్పుకునే అంశమే. అభిజిత్‌కు ఉండే ప్లస్సులు, మైనస్‌లు అతనికీ ఉన్నాయి. కానీ అభిజిత్‌కు ప్రస్తుతం ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూల్ది కాదు. ఒకప్పుడు కౌశల్ ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిందే. రెండో సీజన్ తరువాత మళ్లీ ఈ నాల్గో సీజన్‌లోనే ఈ రేంజ్ హల్చల్ జరుగుతోంది. అభిజిత్ ఫ్యాన్స్ నిన్న సాయంత్రం ఓ ట్రెండ్ మొదలెట్టారు.

నిన్న సాయంత్రం..
శనివారం సాయంత్రం అభిజిత్ ఫ్యాన్స్ #WeAdmireAbijeet అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేయడం ప్రారంభించారు. నిన్నటి షోలో అభిజిత్‌కు వచ్చిన కాంప్లిమెంట్స్ ఓ వైపు ట్రెండ్ అవుతూ ఉంటే.. మరోవైపు సోషల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్‌లతో రచ్చ చేస్తూ వచ్చారు.

నిరంతరంగా..
ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం ఇంతలా ట్వీట్ల యుద్దాన్ని ఇది వరకెన్నడూ జరగలేదు. రెండో సీజన్ నుంచి బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ప్రచారం, ఆర్మీల పేరిట ఫ్యాన్స్ విడిపోవడంతో జరిగింది. రెండో సీజన్‌లో కౌశల్ విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. అలాంటి కౌశల్ పేరిట కూడా ఇలాంటి ట్రెండ్స్ జరగలేదు. ఈ రేంజ్‌లో నిరంతరంగా అభిజిత్ ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతూనే వచ్చారు.

24 గంటల్లో 500k..
24 గంటల్లో ఐదు లక్షలకు పైగా ట్వీట్లు కొట్టి సంచలనం సృస్టించారు. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఏ కంటెస్టెంట్‌కు కూడా ఇలాంటి ఫీట్ దక్కలేదని అభిజిత్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక అభిజిత్ ఫ్యాన్స్ హవా చూసి మిగతా వారంతా అవాక్కవుతున్నారు.

టాప్ 5లో వీళ్లే..
శనివారం నాటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ టాప్ 5 కంటెస్టెంట్లపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అరియానా ఫ్యామిలీ దృష్టిలో తప్పా మిగతా అందరి దృష్టిలో అభిజిత్ టాప్ 5లో ఉన్నాడు. అయితే అభిజిత్‌కు గట్టిపోటి ఇచ్చేది మాత్రం సోహెలే. అభిజిత్ ఫ్యాన్స్ వర్సెస్ సోహెల్ ఫ్యాన్స్ అన్నట్టు ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ స్పెషల్ ట్రెండ్‌లో అభిజిత్, అతని ఫ్యాన్స్ సత్తా ఏంటో అందరికీ తెలిసివచ్చిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











