అమ్మ బాబోయ్ మహానటిని మించిపోయింది.. చివరకు హారిక అలా దొరికిపోయింది!
బిగ్ బాస్ తొమ్మిదో వారంలో ఇంటి సభ్యులకు ఇచ్చిన పల్లెకు పోదాం ఛలో ఛలో అనే టాస్క్ ఎట్టకేలకు పూర్తైయింది. హారిక తన సీక్రెట్ టాస్కులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేసింది. గొడవలు పడ్డ వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. కెప్టెన్సీ పోటీ దారులను ఎంచుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్‌లో రంగు రింగు అనే టాస్క్‌లో హారిక, అరియానా, అమ్మ రాజశేఖర్‌లలో ఎవరు గెలుస్తారో చూడాలి. ఇదంతా కాసేపు పక్కన పెడదాం. సీక్రెట్ టాస్కులను పూర్తి చేసేందుకు హారిక పడ్డ కష్టం, చేసిన నటన మహానటి లెవెల్‌లో ఉంది.

రెండో సీక్రెట్ టాస్క్.
హారిక ఊర్లో పుకార్లు పుట్టిస్తూ.. అందరి పనుల్లో సాయం చేస్తుంటుందని చెప్పిన బిగ్ బాస్ ఓ సీక్రెట్ టాస్క్ కూడా ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ మీద కాఫీ పోయాలని, అవినాష్‌కు కోపం తెప్పించాలని, ఎవరో ఒకరి పేరును లిప్ స్టిక్‌తో అద్దం మీద రాయాలని తెలిపాడు. వీటిని హారిక సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసింది.

ఏమీ తెలియని దానిలా..
కట్టెల కోసం అందరూ ఫైట్ చేస్తుండగా.. సరైన సమయం కోసం హారిక ఎదురుచూసింది. పాన్ షాప్ యజమానితో అమ్మ రాజశేఖర్ గొడవ పడుతుండగా సందులో సడేమియా అన్నట్టు హారిక కాఫీ పోసేసింది. అమ్మ రాజశేఖర్ మీద కాఫీ పోసి హత్య చేయాలని ఇచ్చిన మొదటి సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేసింది. కానీ అదేదో తెలియకుండా జరిగిపోయిందని తరువాత మాస్టర్‌ను కాకపట్టింది. టిష్యూతో తుడిచేస్తా అంటూ కవర్ చేసింది.

అవినాష్‌ను రెచ్చగొట్టింది..
అవినాష్ పాన్ షాప్ వద్ద ఎలా గొడవ చేద్దామా? అని ఆలోచించింది హారిక. అప్పటికే అఖిల్ అక్కడ ఏదో రచ్చ చేస్తున్నాడని చూసి హారిక కూడా గొడవ పెట్టేందుకు వెళ్లింది. రెండు పాన్లు ఇవ్వాలంటూ దబాయించింది. ఇలాంటి దాంతో ఏంటి అని అన్న అవినాష్ మాటను పట్టుకుని హారిక గొడవ పెట్టేసుకుంది. అయితే హారిక గొడవ మొదలుపెట్టినా కూడా అది అఖిల్ మీదకు వెళ్ళింది.

రెండో హత్య తరువాత..
రెండో హత్య జరిగిందని బిగ్ బాస్ ప్రకటించాక హారిక ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్, ఏం జరిగిందో తెలియనట్టు పెట్టిన ఆ అమాయకపు మొహం మహానటి లెవెల్‌లో ఉంది. ఓ రేంజ్‌లో నటించిన హారిక అక్కడ ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. కానీ మూడో హత్యలో మాత్రం దొరికిపోయింది.

చేతి రాతను గుర్తుపట్టేశారు..
హారిక చేతిరాతను అభిజిత్ గుర్తుపట్టేశాడు. పంచాయితీలో అందరూ కూడా ఆమె దోషి అని నిర్దారించారు. బిగ్ బాస్ కూడా అదే నిజమని చివరకు తెలిపాడు. మొత్తానికి మూడు టాస్కులను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసినందుకు కెప్టెన్సీ పోటీదారురాలిగా ఎంపికైంది.


Click it and Unblock the Notifications











