అరియానా తరువాత అభిజిత్.. డేంజర్ జోన్‌లోకి వచ్చినట్లే..
సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ ఒక్కసారిగా హౌజ్ లో వాతావరణాన్ని చేంజ్ చేసింది. బిగ్ బాస్ 4లో మొన్నటివరకు జరిగింది ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్లుగా కంటెస్టెంట్స్ వారి పెర్ఫెమెన్స్ తో రెచ్చిపోతున్నారు. అయితే అవినాష్ తప్పితే మిగతా కంటెస్టెంట్స్ ఏడుగురు కూడా అరియానపైనే ఫోకస్ పెట్టారు. అయితే అరియానా తరువాత మరో టార్గెట్ పై కూడా అనుమానాలు ఎక్కువవుతున్నాయి.
స్మార్ట్ బాయ్ అభిజిత్ ని కూడా డేంజర్ జోన్ లో పడేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సోమవారం ఎపిసోడ్ తో ఒక క్లారిటీ అయితే వచ్చింది. సోహైల్, అఖిల్ నామినేట్ చేసిన విషయం తెలిసిందే. మెహబూబ్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ అభిపైనే అందరి దృష్టి ఎక్కువవుతోంది. లాస్య, హారిక సపోర్ట్ ఎలాగూ ఉంది కాని మిగతా వారు అతనికి సపోర్ట్ చేయడం లేదు. మోనాల్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇక అఖిల్, సోహైల్ ఒకటయ్యారు. అవినాష్ కూడా అతనిపై కోపం ఉంది.

దీంతో ఈ వారం కాకపోయినా కూడా అభిజిత్ నెక్స్ట్ టార్గెట్ అయ్యేలా ఉన్నాడని అనిపిస్తోంది. ఈ వారం జరగబోయే టాస్కులు చాలా కీలకం కానున్నాయి. అభి గనక తెలివిగా నడుచుకోకపోతే రిస్క్ లో పడినట్లే. అభికి జనాల సపోర్ట్ బాగానే ఉంది గాని కొన్నిసార్లు ఎలిమినేషన్స్ నమ్మకంగా లేవనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అరియానా, మెహబూబ్ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళతారనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి నాగార్జున వచ్చేవారం ఎలాంటి షాక్ లు ఇస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











