అభిజిత్ ఇంటెలిజెన్స్‌కు అదే నిదర్శనం.. ఎలాంటి పరిస్థితుల్లోనూ తొణకడు బెణకడు!
బిగ్ బాస్ షోలో అభిజిత్ ఎలా ఉంటాడు.. ఎలా మాట్లాడతాడు.. ఎంతలా ఆలోచిస్తాడు వంటి విషయాలన్నీ అందరికీ తెలిసిందే. అది ఎలాంటి పరిస్థితులోనైనా సరే తన పంథాను, తన ఆలోచనాధోరణిని విస్మరించడు. ప్రతీ విషయాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలిస్తాడు. ఇక బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు అయితే మరీ లోతుగా అబ్జర్వ్ చేస్తాడు. ప్రతీ విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తాడు. తాజాగా అభిజిత్ పరిశీలనా శక్తి గురించి అందరికీ తెలిసింది.

ఫిజికల్‌గా కాస్త వీక్...
బిగ్ బాస్ షోలో ఫిజికల్ టాస్కులు ఆడితేనే గెలుస్తారన్న నియమేమీ లేదు. కానీ ఫిజికల్ టాస్కులు ఆడితే మరింత మద్దతు పెరుగుతుంది. కానీ అభిజిత్‌కు ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల ఆటలు ఆడలేకపోతున్నాడు. కాళ్లు, భుజాలకు చికిత్సలు జరిగాయి. అందుకే ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

లోతుగా విశ్లేషణ..
ప్రతీ విషయాన్ని అభిజిత్ లోతుగా విశ్లేషిస్తాడు. ఇంట్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు.. ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారు? ఇలా ప్రతీ విషయాన్ని వివరిస్తాడు. అభిజిత్ చెప్పే విషయాలు దాదాపు నిజమే అవుతాయి. అయితే ఇవన్నీ ఒకెత్తు అయితే నిన్నటి హయర్ లగ్జరీ బడ్జెట్ టాస్కులో అభిజిత్ పర్ఫామెన్స్ అదిరిపోయింది.

క్విజ్ పోటీలు..
క్విజ్ పోటీలు పెట్టి.. అందులో గెలిచిన ప్రతీసారి కొన్ని వస్తువులు సొంతమవుతాయని బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. ఇందుకోసం అభిజిత్, లాస్య, మోనాల్, సోహెల్‌లను క్విజ్ పోటీలకు ఎంపికచేశాడు. క్విజ్ పోటీల టాస్కును నిర్వహించే బాధ్యతను అవినాష్‌కు అప్పగించాడు బిగ్ బాస్.

ఫటా ఫట్ చెప్పేశాడు..
సోహెల్, లాస్య, మోనాల్ కాస్త తడబడినా కూడా అభిజిత్ మాత్రం అన్ని ప్రశ్నలకు ఫటా ఫట్ సమాధానం చెప్పాడు. అది కూడా అతి ఏ మాత్రం ప్రదర్శించకుండా.. తొణకకుండా బెణకకుండా.. టకాటకా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఇంట్లో నెమళి బొమ్మలు ఎన్ని ఉన్నాయి.. గిటార్ బొమ్మలు ఎన్ని ఉన్నాయి.. ఇలా బిగ్ బాస్ ఇంటికి సంబంధించిన ప్రశ్నలను సంధించగా సమాధానాలు చెప్పాడు. ఇవి అభిజిత్ పరిశీలనాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











