నిన్న, మొన్న సంపాదించుకున్నది ఒక్క క్షణంలో పోయింది.. అరియానాపై నెగెటివ్ ట్రోలింగ్
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ప్రోమో క్రియేట్ సెన్సేషన్‌లు ఎపిసోడ్‌లు క్రియేట్ చేయలేకపోతోన్నాయి. ప్రోమోలో ఉన్న స్టఫ్, కంటెంట్ ఎపిసోడ్‌లోకి వచ్చేసరికి మిస్ అవుతోంది. అలా చాలా మంది ప్రోమోను చూసి ఆటను డిసైడ్ చేసేస్తున్నారు. పైగా ప్రోమో కట్ చేసే విధానం కూడా అలాగే ఉంటోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో అరియానాకు బాగా నష్టం జరుగుతోంది. సెల్ఫీష్ అంటూ అరియానాను అందరూ తిట్టిపోస్తున్నారు.

రెండు సార్లు..
పద్నాలుగో వారంలో అందరినీ నామినేట్ చేసిన బిగ్ బాస్ ఓ ఆఫర్ ఇచ్చాడు. ప్రజలకు అభ్యర్థన వినిపించి.. ఓట్లు వేయమని అప్పీల్ చేసే అవకాశమిస్తానని చెప్పాడు. అందుకు అనుగుణంగా టాస్క్‌లు చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపాడు. అలా ఇప్పటి వరకు వచ్చిన మూడు టాస్కుల్లో అరియానా రెండు సార్లు గెలిచి గోల్డెన్ మైక్‌ను సాధించుకుంది. సోహెల్ ఒక్కసారి గోల్డెన్ మైక్‌ను పట్టుకుని ఓట్లు అడిగాడు.

నేటి ఎపిసోడ్‌లో అలా..
ఇక నేడు బిగ్ బాస్ చివరి చాన్స్ ఇచ్చినట్టు కనిపించింది. నాల్గో అవకాశంగా ఇంటి సభ్యులకు నాన్ స్టాప్ డ్యాన్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో చివరి వరకు ఎవరు డ్యాన్స్ చేస్తూ ఉంటారో వారికే గోల్డెన్ మైక్ లభిస్తుంది. ఆ తరువాత ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతూ ఓట్లను అప్పీల్ చేసుకునే చాన్స్ దొరుకుతుందని తెలిపాడు. అయితే మ్యూజిక్ ఆగిన ప్రతీసారి ఎవరో ఒకరు దిగాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు.

పార్టిసిపేట్ చేస్తాను..
అయితే మొదటి సారి మ్యూజిక్ ఆగిన తరువాత అందరూ కలిసి అరియానాను దిగమని అడిగినట్టున్నారు. ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు చాన్స్ వచ్చింది కదా అని కన్విన్స్ చేశారు. అయితే తాను తరువాత దిగుతాను.. పార్టిసిపేట్ చేయాలనుందంటూ అరియానా తప్పించుకుంది. తానే ఎందుకు ఇంకొకరున్నారుగా అంటూ చెప్పుకొచ్చింది.

వాదన ఇష్టం లేక..
ఇక అరియానా, సోహెల్ దిగేందుకు సన్నద్దంగా లేకపోవడంతో వాదనలు పెట్టుకునే ఓపిక లేకనో గానీ అభిజిత్ మొదటగా దిగేశాడు. అలా అభిజిత్ దిగడంతో అందరూ షాక్అయ్యారు. అయితే నెటిజన్లు మాత్రం అరియానాను బాగా ట్రోల్ చేస్తున్నారు.

నెగెటివ్ ట్రోలింగ్..
ఇప్పటికే రెండు సార్లు వెళ్లావ్? ఇంకెన్ని సార్లు వెళ్తావ్ అంటూ ఫైర్ అవుతున్నారు. కెప్టెన్సీ సమయంలో అయితే అందరికీ చాన్స్ రావాలని చెప్పావ్.. ఇప్పుడేమో ఇలానా? అంటూ అసలైన స్వార్థపరురాలివి అంటూ అరియానాను ఏకిపారేస్తున్నారు. అయితే కొందరు అరియానా ఫ్యాన్స్ మాత్రం.. ఆమె ఎందుకు దిగాలంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారు.
Recommended Video
నిన్న, మొన్న అలా..
నిన్న, మొన్న సోహెల్ అరియానా మధ్య జరిగిన గొడవలో అరియానాకే సింపతి వచ్చింది. అరియానా కూడా మీద మీదకు వచ్చినా ఉమెన్ కార్డ్ వాడి అరియానా సింపతీ కొట్టేసింది. ఇక వీకెండ్‌లో నాగార్జున ఎలాగూ అరియానానే సపోర్ట్ చేసి మాట్లాడతాడు. కానీ ఇప్పుడు మాత్రం అరియానాకు నెగెటివ్ ట్రోలింగ్ ఎదురైంది.


Click it and Unblock the Notifications











