నిప్పుతో ఆడుకుంటున్నాడు.. మటన్ షాప్ యజమాని గడ్డి పెడితే మేక లోపలికి వెళ్లిపోతుందా?: అభిజిత్
బిగ్ బాస్ హౌజ్ లో అభిజిత్, అఖిల్ మధ్య వివాదాలు మళ్ళీ మొదలయ్యాయి. ఒక విధంగా హోస్ట్ నాగార్జున నిప్పును రాజేసి చిచ్చు పెట్టినట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. పేరెంట్స్ రాకతో ఒక్కసారిగా ఎమోషనల్ అయిన హౌజ్ మెంట్స్ అలానే ఉంటే రేటింగ్ తగ్గిపోయే ఛాన్స్ ఉందని బిగ్ బాస్ నిర్వాహకులకు అర్ధమయినట్లుంది. అందుకే నాగార్జున కరెక్ట్ టైమ్ లో అందరిలో పాత గాయాలను కదిలించారు. దీంతో హౌజ్ ఒక్కసారిగా హీటెక్కింది.

మళ్ళీ మొదలైఙక్ అఖిల్, అభి గొడవలు
ముఖ్యంగా అఖిల్, అభి చాలా రోజుల తరువాత మళ్ళీ ఒకరిపై మరొకరు నిందలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. మొన్న ఇద్దరి అమ్మల రాకతో ఆప్యాయంగా మాట్లాడుకున్న కంటెస్టెంట్స్ నిమిషాల్లో చేంజ్ అయ్యారు. అఖిల్, అభి మధ్య జరిగిన చర్చలో చివరికి నాగార్జున కూడా ఎవరిది తప్పో డిసైడ్ చేయలేక మీరే తేల్చుకోండి అంటూ హైప్ క్రియేట్ చేశారు.

అభిజిక్ కు బ్లాక్ రోజాను ఇచ్చిన అఖిల్
ముందు ఒకలా..వెనక ఒకలా.. ఉండే కంటెస్టెంట్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం కావాలని నాగార్జున అడగడంతో అఖిల్ చేతిలో ఉన్న బ్లాక్ రోజాను అభిజిత్ కు అందించాడు. ఇక అప్పుడు పాత గోడవలని ఇద్దరు బయటకు తీశారు. నేను హౌజ్ నుంచి వెళ్లిపోయే సమయంలో అభి నా గురించి తప్పుగా మాట్లాడాడని చెప్పిన అఖిల్.. అభి ముందు ఉన్నప్పుడు 5నిమిషాలు బాగానే ఉంటాడు కానీ ఆ తరువాత వెంటనే మారిపోతాడని ఆన్సర్ ఇచ్చాడు.

నేను అలాంటివాన్ని కాదు
ఇక అసలు మ్యాటర్ లోకి వచ్చిన అభిజిత్ తన సమాధానాన్ని నాగార్జునకు చాలా పద్ధతిగా వివరించాడు. అఖిల్ గురించి మీ ముందు మాట్లాడటానికే చాలా వెయిట్ చేశాను. ముందు ఒకలా వెనుక ఒకలా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నామినేషన్స్ అంటేనే ఒప్పుకోని పర్సన్ బయటకు వెళ్లిపోవాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఎలా వెళ్లిపోతాడు. ఆ పాయింట్‌పైనే నేను మాట్లాడనని అన్నాడు.

అఖిల్ నిప్పుతో ఆడుకుంటున్నాడు
నిజంగా అఖిల్ నిప్పుతో ఆడుకుంటున్నాడు. మటన్ షాప్ యజమాని గడ్డి పెడితే మేక లోపలికి వెళ్లిపోతుందా? బిగ్ బాస్ తలచుకుంటే ఏం జరిగేది. అతని అదృష్టం వల్ల వచ్చాడు లేదంటే పరిస్థితి ఏంటి?? ఇంట్లో జరిగే ప్రతివిషయాన్ని తానే న్యాయం చేస్తున్నట్లు పెద్దగా వ్యవహరిస్తాడు. మాట్లాడితే మోనాల్ పాయింట్ ని తీసుకుని వస్తాడు..అంటూ అభిజిత్ ఘన మనసులో అనుకున్న భావాన్ని నాగార్జున ముందు బయటపెట్టేశాడు.

చేతులెత్తేసిన నాగార్జున
ఇక అభిజిత్ మాట్లాడిన తరువాత అఖిల్ ఆ స్టేట్మెంట్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఇలా మాట్లాడి ఆ తరువాత ఇంకోలా మారిపోతాడాని రొటీన్ ఆన్సర్ ఇవ్వడంతో నాగార్జున చేతులెత్తేశారు. విబేధాలు వల్లే ఇదంతా వస్తోందని సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మీకే వదిలేస్తున్నాను.. ఇకమీ గొడవకు మీరే తేల్చుకోవాలని నాగార్జున ఆ టాపిక్ కు ఎండ్ కార్డ్ పెట్టేశారు.


Click it and Unblock the Notifications











