Don't Miss!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- News చిలుకూరు బాలాజీ ఆలయానికి గరుడ ప్రసాదం కోసం భక్తుల రష్.. అసలేమిటీ గరుడ ప్రసాదం?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
కాలుజారిన అభిజిత్.. టాస్క్ అంతా రచ్చ రచ్చ!!
బిగ్ బాస్ షోలో ఇంత వరకు ఫిజికల్ టాస్కులు ఆడని కంటెస్టెంట్‌గా అభిజిత్ ఓ రికార్డు క్రియేట్ చేశాడు. ఆడినా కూడా అంటీ అంటన్నట్టు ఆడేస్తాడు. అభిజిత్ భుజానికి గాయం అవ్వడంతోనే ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉంటున్నాడని కొందరు కామెంట్లు చేస్తుంటారు. అభిజిత్ రేసర్ అని ఓ ప్రమాదంలో భుజానికి గాయమైందని కొన్ని ఫోటోలు, వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సారి అభిజిత్ వంద శాతం శక్తిని ఉపయోగించి టాస్కు ఆడితే కాలు జారి పడ్డాడు.
బీబీ హోటల్ టాస్క్‌లో టిప్ కోసం బాగానే శ్రమించాడు. కానీ ఫిజికల్ టాస్కులు, కొట్టుకోడం, అడ్డుపడటం, లాగడం, తోయడం వంటివి మాత్రం చేయడు. ఈ విషయంలో అభిజిత్‌పై ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. తాజాగా అభిజిత్ మాత్రం ఓ టాస్క్‌లో పార్టిసిపేట్ చేశాడు. రన్, ఫైర్, వాటర్ అంటూ సోహెల్ ఓ ఆట ఆడించాడు. రన్ అంటే గార్డెన్ ఏరియాలో ఉన్న నల్ల మ్యాట్ దగ్గరికి చేరుకోవాలి.
ఫైర్ అంటే రెడ్ మ్యాట్ దగ్గరికి చేరుకోవాలి. వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి. ఇక సోహెల్ అందరి చేత ఈ ఆట ఆడించాడు. మొదటగా రన్ అనడంతో బ్లాక్ మ్యాట్ వద్దకు వచ్చారు.. ఆపై ఫైర్ అనడంతో రెడ్ మ్యాట్ దగ్గరకు వచ్చారు. మళ్లీ వాటర్ అనడంతో స్విమ్మింగ్ పూల్‌లో దూకారు.
అక్కడి నుంచి రన్ అనడంతో అందరూ వెళ్లి బ్లాక్ మ్యాట్‌పై నిలుచున్నారు. అలా అభిజిత్ స్పీడ్‌గా రన్ చేసుకుంటూ రావడంతో జారి పడిపోయాడు. అభితో పాటు ఇంకా వేరే వారు కూడా పడ్డట్టు కనిపిస్తోంది. ఏదైనా గాయాలు తగిలి ఉంటాయో లేదో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.