twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాలుజారిన అభిజిత్.. టాస్క్ అంతా రచ్చ రచ్చ!!

    |

    బిగ్ బాస్ షోలో ఇంత వరకు ఫిజికల్ టాస్కులు ఆడని కంటెస్టెంట్‌గా అభిజిత్ ఓ రికార్డు క్రియేట్ చేశాడు. ఆడినా కూడా అంటీ అంటన్నట్టు ఆడేస్తాడు. అభిజిత్‌ భుజానికి గాయం అవ్వడంతోనే ఫిజికల్ టాస్కులకు దూరంగా ఉంటున్నాడని కొందరు కామెంట్లు చేస్తుంటారు. అభిజిత్ రేసర్ అని ఓ ప్రమాదంలో భుజానికి గాయమైందని కొన్ని ఫోటోలు, వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సారి అభిజిత్ వంద శాతం శక్తిని ఉపయోగించి టాస్కు ఆడితే కాలు జారి పడ్డాడు.

    బీబీ హోటల్ టాస్క్‌లో టిప్ కోసం బాగానే శ్రమించాడు. కానీ ఫిజికల్ టాస్కులు, కొట్టుకోడం, అడ్డుపడటం, లాగడం, తోయడం వంటివి మాత్రం చేయడు. ఈ విషయంలో అభిజిత్‌పై ఫిర్యాదులు వస్తూనే ఉంటాయి. తాజాగా అభిజిత్ మాత్రం ఓ టాస్క్‌లో పార్టిసిపేట్ చేశాడు. రన్, ఫైర్, వాటర్ అంటూ సోహెల్ ఓ ఆట ఆడించాడు. రన్ అంటే గార్డెన్ ఏరియాలో ఉన్న నల్ల మ్యాట్ దగ్గరికి చేరుకోవాలి.

    Bigg Boss 4 Telugu ABhijeet Slipped and Fell n Task

    ఫైర్ అంటే రెడ్ మ్యాట్ దగ్గరికి చేరుకోవాలి. వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్‌లో దూకాలి. ఇక సోహెల్ అందరి చేత ఈ ఆట ఆడించాడు. మొదటగా రన్ అనడంతో బ్లాక్ మ్యాట్ వద్దకు వచ్చారు.. ఆపై ఫైర్ అనడంతో రెడ్ మ్యాట్ దగ్గరకు వచ్చారు. మళ్లీ వాటర్ అనడంతో స్విమ్మింగ్ పూల్‌లో దూకారు.

    అక్కడి నుంచి రన్ అనడంతో అందరూ వెళ్లి బ్లాక్ మ్యాట్‌పై నిలుచున్నారు. అలా అభిజిత్ స్పీడ్‌గా రన్ చేసుకుంటూ రావడంతో జారి పడిపోయాడు. అభితో పాటు ఇంకా వేరే వారు కూడా పడ్డట్టు కనిపిస్తోంది. ఏదైనా గాయాలు తగిలి ఉంటాయో లేదో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాలి.

    English summary
    ABhijeet Slipped and Fell n Task, Bigg Boss 4 Telugu Daycare Task ABhijeet Fires On Harika, Bigg Boss 4 Telugu Day Care Task Goes Viral, Bigg Boss 4 Telugu Abhijeet Lasya Noel Harika Conversation, Bigg Boss 4 Telugu Week 8 Akhil Talks With Abijeet About Monal, Ariyana And Avinash Celebrate Bathukamma, Bigg Boss 4 Telugu Week 7 Abhijeet Satires On Akhil Monal Romance, Prema Modhalaindhi Movie, Bigg Boss 4 Telugu Avinash Akhil About Ariyana, Amma Rajasekhar And Sohel Conversation About Divi, Bigg Boss 4 Telugu week 7
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X