గెలవాలని రాలేదు, నాకంటే స్ట్రాంగ్ ఎవరూ లేరు.. నాకు నేను పోటీ: అభిజిత్
బుధవారం ఎపిసోడ్ లో హౌజ్ లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ వారం ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయో ఎవరికి అంతు చిక్కడం లేదు. మొన్నటివరకు ఫ్రెండ్లిగా ఉన్న వారు కూడా ఈ వారం నామినేషన్స్ మొదలయ్యే సరికి శత్రువులుగా మారుతున్నారు. ముఖ్యంగా మెహబూబ్, అఖిల్, సోహైల్ కి అస్సలు పడటం లేదు. ఇక అందుకు కారణం కెప్టెన్సీ పోస్ట్ అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో నడిచిన హై డ్రామా నెవర్ బిఫోర్ అనేలా ఉంది.
Recommended Video

బలంగా ఉన్నవారు బయటకు..?
ఒకరిపై మరొకరు సీక్రెట్ గా సెటైర్లు వేయడం కామెంట్స్ చేయడం కామన్ అయినప్పటికీ అవి భవిష్యత్తులో సీరియస్ అవుతాయని ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల కారణంగా తేలిపోయింది. అసలు విషయంలోకి వస్తే.. సాధారణంగా బిగ్ బాస్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ వీక్ గా ఉంటే బయటకు పంపించే అవకాశం ఉంటుంది. కానీ ఈ సారి ఆ విషయంలో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఏ కంటెస్టెంట్ బలంగా ఉన్నాడో వారిని పంపించవచ్చని చాలెంజ్ విసిరాడు.

ఓవరాక్షన్ చేస్తున్నట్లు అర్థమయ్యింది
అర్ధరాత్రి లేపి సూట్ కేసులు సర్దుకొమ్మని చెప్పిన బిగ్ బాస్ అసలు ఎం చెప్పాలని అనుకుంటున్నాడు అనే విషయం ఎవరికి అర్థం కాలేదు. ఒక విధంగా బుధవారం ఎపిసోడ్ లో అందరు కాస్త ఓవరాక్షన్ చేస్తున్నట్లు అర్థమయ్యింది. హౌజ్ మెంట్స్ అంతా కలిసి పోటీగా ఉన్న బలమైన కంటెస్టెంట్ ని నామినేట్ చేసి హౌజ్ నుంచి బయటకు పంపవచ్చని బిగ్ బాస్ అదేశించగా ఎవరి స్టైల్లో వాళ్ళు బిల్డప్ కొట్టేశారు.

ఇక్కడకి గెలవాలని రాలేదు
ఇక అభిజిత్ అయితే నా కంటే తోపు ఎవడు లెడిక్కడ అనే రేంజ్ లో షాక్ ఇచ్చాడు. ఇది అన్ ఫెయిర్‌గా అనిపిస్తుందని అంటూ.. స్ట్రాంగ్ అయితే వెళ్లాలని అనడం కరెక్ట్ కాదు. నేను ఇక్కడకి గెలవాలని రాలేదు.. ఎక్స్‌పీరియన్స్ తెలుసుకోవడానికి వచ్చాను.. అయితే ఇక్కడికి వచ్చిన తరువాత ఎవరు ఏంటో చాలా క్లారిటీగా అర్థమైందని చెప్పాడు.

నాకంటే స్ట్రాంగ్ ఎవరూ లేడు
అంతే కాకుండా నా వరకూ అయితే నాకంటే స్ట్రాంగ్ ఎవరూ లేడు అంటూ నాకు అడ్డుగా ఉన్నది ఎవరూ లేరు. అందుకే నాకు నేను పోటీ అని చెబుతున్నాను బిగ్ బాస్. మీరు పేరు చెప్పమన్నారు కాబట్టి అభిజిత్ అంటూ తన పేరు తాను చెప్పుకున్నాడు అభిజిత్. అయితే చివరికి బిగ్ బాస్ ఎవరిని పంపించకుండా హై డ్రామా క్రియేట్ చేయడం కాస్త ఓవర్ గానే అనిపించింది. బిగ్ బాస్ లో వాతావరణాన్ని చేంజ్ చేయాలని బాగానే కష్టపడ్డారు గాని అంతా వర్కౌట్ కాలేదనే కామెంట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications