Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్‌బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగిందేమిటి.. అభిజిత్ ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే చాలు
కరోనా కష్టకాలంలో షూటింగ్స్ చేయడం అంత ఈజీ కాదని అనుకుంటున్న తరుణంలో బిగ్ బాస్ నిర్వాహకులు షోను సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేసి విజయం సాధించారు. 15 వారాల పాటు కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4 ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ను అందించిందనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ ద్వారా క్రేజ్ అందుకున్న స్టార్స్ జాగ్రత్తగా ఉండాల్సిన టైమ్ ఆసన్నమైంది. ముఖ్యంగా అందరి ఫోకస్ ఎక్కువగా బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ పైనే ఉంటుంది.
మొదటికే మోసం వస్తుంది..
బిగ్ బాస్ విన్నర్ కు కొన్ని కోట్లల్లో ఓట్లు దక్కుతాయి. దాదాపు తెలుగు ఆడియెన్స్ ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బాస్ విన్నర్ గురించి తెలుస్తుంది. బిగ్ బాస్ చూడని వారికి కూడా విన్నింగ్ సెలబ్రేషన్స్ తో ఎలాగైనా తెలుస్తుంది. అయితే కేవలం తెలుగులో అనే కాకుండా బిగ్ బాస్ ట్రోపి గెలిచిన తరువాత ఎవరైనా సరే ఆ క్రేజ్ ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
సీజన్ 1లో ఆ ఇద్దరు..
ఇక తెలుగులో అయితే ఇంతవరకు మూడు సీజన్స్ లలో విన్నర్స్ గా నిలిచిన వారు మాత్రం అనుకున్నంత రేంజ్ లో అయితే కెరీర్ ను సెట్ చేసుకోలేకపోయారు. మొదట ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన సీజన్ 1లో శివబాలాజీ గెలిచిన విషయం తెలిసిందే. రన్నరప్ గా బాలకృష్ణ ఆదిత్య నిలిచాడు. ఇద్దరు కూడా ఆ తరువాత సినిమాల్లో ఛాన్స్ లు అందుకున్నా కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయారు.
అర్జున్ రెడ్డి లెవెల్లో బజ్ క్రియేట్ చేసి..
ఇక రెండవ సీజన్ లో కౌషల్ మండా విజేతగా నిలిచాడు. షో జరిగినన్ని రోజులు కూడా అతను అర్జున్ రెడ్డి లెవెల్లో గేమ్ ఆడాడు. క్రేజ్ కూడా బాగానే అందుకున్నాడు. కానీ బయటకు వచ్చిన తరువాత మాత్రం తుస్సుమనిపించాడు. హీరోగా ట్రై చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. రన్నరప్ గా నిలిచిన గీత మాధురి కూడా సింగర్ గా అంతగా బిజీ అయితే అవ్వలేదు.
వాళ్ళిద్దరూ కూడా..
ఇక మూడవ సీజన్ విషయానికి వస్తే సెలబ్రెటీల విషయంలో కాస్త ఎక్కువగా ఆలోచించినా నిర్వాహకులు కాస్త క్రేజ్ ఉన్న వాళ్లనే దింపారు. ఇక విన్నర్ గా నిలిచిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ గట్టిగానే అందుకున్నాడు. గ్లామరస్ యాంకర్ శ్రీముఖితో పోటీగా నిలిచి గతంలో కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. అయితే ఆ క్రేజ్ ను రాహుల్ ఇంకా సరైన క్రమంలో వాడుకోలేదు. అతను చేసిన ప్రయివేట్ సాంగ్స్ ఈ మధ్య పెద్దగా క్లిక్కవ్వలేదు. ఇక ఆ సీజన్ రన్నరప్ శ్రీముఖి యాంకరింగ్ జీవితంలో కూడా పెద్దగా మార్పులు ఏమి రాలేదు.
వాళ్ళు చేసిన పొరపాటు చేయకుండా ఉంటే చాలు
ఇక బిగ్ బాస్ సీజన్ 4లో అత్యదిక ఓట్లు అందుకున్న అందరికంటే ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకున్న నటుడు అభిజిత్. అతను హౌజ్ లోకి రావడం బిగ్ బాస్ గర్వంగా ఉందని చెప్పడంతోనే అర్ధమయ్యింది అభి క్రేజ్ ఎలా పెరిగిందో. అయితే గతంలో విన్నర్స్ ఎవరు కూడా బిగ్ బాస్ క్రేజ్ ను సరిగ్గా వాడుకోలేకపోయారు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ చేయకుండా అభిజిత్ ఎంతవరకు నిలదొక్కుకుంటాడో చూడాలి. ఇక రన్నరప్ అఖిల్ కు కూడా కొంత వరకు క్రేజ్ దక్కింది. అతను కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తే క్లిక్కయ్యే అవకాశం ఉంది.