Bigg Boss Day 1.. కరాటే కళ్యాణి ఓవరాక్షన్‌కు అభిజీత్ రియాక్షన్.. సోషల్ మీడియాలో రచ్చ
సోషల్ మీడియాలో కొత్త సందడి మొదలైంది. బిగ్‌బాస్ షోను చూసి ఎంత మంది ఎంజాయ్ చేస్తారో.. వాటిపై వచ్చే ట్రోల్స్, మీమ్స్‌ను చూసి అంతకు పదింతల మంది ఎంజాయ్ చేసేవారుంటారు. షోతో సంబంధం లేకపోయినా వారు చూడకపోయినా సరే మీమ్స్‌ను మాత్రం రెగ్యులర్‌గా ఫాలో అవుతుంటారు. ఇక బిగ్‌బాస్‌పై సోషల్ మీడియాలో నడిచే టాక్ గురించి ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. ఇక మొదటి ఎపిసోడ్‌పై లెక్కలేనన్ని ట్రోల్స్, మీమ్స్ హల్చల్ చేశాయి.

కన్నీటినే ఓ స్ట్రాటజీగా..
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో చూస్తుంటే చాలా మంది ఓ స్ట్రాటజీని ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. మోనాల్ గజ్జర్ వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీ గురించి చెప్పడం తాను ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఎదుటి వారిని కూడా ఎమోషనల్ అయ్యేట్టు చేస్తోంది. ఊరి విశేషాలు చెప్పమంటే తండ్రి, ఫ్యామిలీ అంటూ ఏవేవో చెప్పి ఎమోషనల్ అయింది. ఈమెను చూసి గంగవ్వ కూడా ఏడ్చేసింది.

కరాటే కళ్యాణి సైతం..
నిన్నటి ఎపిసోడ్‌లో కరాటే కళ్యాణి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వంటగది నుంచి మొదలైన ఈ రచ్చ.. ఎపిసోడ్ ఆసాంతం కొనసాగుతూనే వచ్చింది. సీక్రెట్ రూంలో ఉణ్న సోహెల్ ఫోన్ చేయడం, మొదట సుజాత లిఫ్ట్ చేయడంతో మొదలైంది రచ్చ. ఆ విషయంలో కరాటే కళ్యాణి సుజాతను టార్గెట్ చేసింది. ఇక ఇలా మొదలైన వీరిద్దరి మధ్య గొడవ ఎక్కడికో వెళ్లిపోయింది.

రచ్చ రచ్చగా నామినేషన్ ప్రక్రియ..
మొదటి వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ రచ్చ రచ్చగా మారింది. ఈ విధానంలో వాదోపవాదాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా కరాటే కళ్యాణి, సుజాత మధ్యలో మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎవరిని నామినేట్ చేస్తున్నారో విషయం చెప్పమంటే.. కరాటే కళ్యాణి పురాణాన్ని తవ్వి తీసింది. ఇక కరాటే కళ్యాణి ధాటికి ఎవ్వరూ నిలబడలేకపోయారు.

అభిజీత్ రియాక్షన్ హైలెట్..
కరాటే కళ్యాణి ఎవ్వరినీ మాట్లాడనివ్వకపోవడం, అందర్నీ కమాండ్ చేయడం, పుటేజ్ కోసం ఆరాట పడుతోందని సుజాతపై ఆరోపణలు చేసుకుంటూనే పోతోంది. ఇక మధ్యలో సూర్య కిరణ్ వచ్చి గొడవను ఆపే ప్రతయ్నం చేసినా కూడా ఆగలేదు. తప్పు చేస్తే తల నేలకు రాస్తా అని డైలాగ్ చెప్పడంతో అందరూ ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఇక అభిజీత్ మాత్రం ఏంట్రా బాబూ అనుకుంటున్నట్టుగా తల పట్టుకున్నాడు. ఇక అభిజీత్ ఇచ్చిన ఈ ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అభిజీత్ మీమ్స్, జిఫ్ ఫైల్స్ రచ్చ రచ్చ అవుతోంది.


Click it and Unblock the Notifications











