కింద మంట , చేతిలో ఐస్ .. అతనే కెప్టెన్ .. జైలుకు వెళ్లేది ఎవరంటే?

బిగ్‌బాస్ ఐదో వారంలో ఇచ్చిన హోటల్ టాస్క్‌ ఫలితం నేటి ఎపిసోడ్‌లో రాబోతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో గెస్ట్‌ల టీం టాస్క్ గెలిచినట్టు టాక వినిపిస్తోంది. అయితే ఇందులో కొందరు అతి తెలివిని ప్రదర్శించి బొక్క బోర్లా పడితే.. కొందరు తెలివితో ఆడి టాస్క్‌లో బెస్ట్ పర్ఫార్మర్‌గా నిలిచినట్టున్నాడు. చివరకు కెప్టెన్సీ టాస్క్‌లోనూ త్యాగాలు జరిగినట్టు కనిపిస్తోంది. అయితే ఇంటి సభ్యుల్లో కొందరు వేసుకున్న ప్రణాళికలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది.

అతి తెలివితో..

అతి తెలివితో..

హోటల్ టాస్క్‌లో మేనేజర్ అయిన అభిజిత్ ఈసారి అతి తెలివి ప్రదర్శించాడు. గత టాస్క్‌లో తెలివిని ప్రదర్శించి టీంను గెలిపించాడు. అదే పద్దతిలో ఈసారి కూడా ట్రిక్ ప్లే చేశాడు. రేటింగ్స్‌ను ముందే కొట్టేసి తన వద్దే పెట్టుకున్నాడు అభిజిత్. అంతేకాకుండా హారిక వద్ద ఉన్న స్టార్లను తీసుకుని.. సంతృప్తి చెందే ఇచ్చారని బుకాయించే ప్రయత్నం చేశాడు.

హారిక అలా..

హారిక అలా..

లాస్యకు ఇచ్చిన టాస్క్, చేసిన సేవలకు మెచ్చిన హారిక తన స్టార్‌ను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అలా హారికను మాటల్లో పెట్టిన అభిజిత్ ఆమె వద్ద ఉన్న మిగతా స్టార్లను కూడా తీసుకున్నాడు. అలా తీసుకుంటే స్టార్లు రావని, తాను ఒక్కటే స్టార్‌ను ఇచ్చానని బిగ్ బాస్‌తో పదే పదే విన్నవించుకుంది.

టాస్క్‌లో ఫలితం..

టాస్క్‌లో ఫలితం..

ఇక నేటి ఎపిసోడ్‌లో టాస్క్ ఫలితం రాబోతోన్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో అభిజిత్ స్టార్లను అలా తీసుకోవడం తప్పని బిగ్ బాస్ చెప్పేట్టు కనిపిస్తున్నాడు. ఇక గెస్ట్‌ల టీం టాస్క్‌ను విన్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. అవినాష్ కూడా తన సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేయడంతో కెప్టెన్నీకి పోటీ పడ్డట్టు తెలుస్తోంది.

 అభిజిత్ జైలుకు..

అభిజిత్ జైలుకు..

టాస్క్‌లో వరెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన వారి పేరులో అభిజిత్‌ను ఎంచుకుని ఉంటారు. దీంతో కథ అడ్డం తిరిగి అభి జైలుకు వెళ్లి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెహబూబ్.. సోహెల్ కోసం కెప్టెన్సీని త్యాగం చేసినట్టు కనిపిస్తోంది. అఖిల్, అవినాష్, సోహెల్ కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడ్డారు.

Recommended Video

Kajal Aggarwal's Fiency Gautam Kitchlu's Net Worth Details
చల్లగా వేడిగా..

చల్లగా వేడిగా..

ఇక కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా అఖిల్, అవినాష్, సోహెల్ పోటీ పడ్డారు. కింద మంట పెట్టాడు చేతిలో ఐస్ ముక్కలు పెట్టాడు. ఎక్కువ సేపు ఎవరు ఆ బాధను భరిస్తారో వారే కెప్టెన్ అవుతారని తెలిపాడు. ఈ టాస్క్‌లో సోహెల్ విజయం సాధించి కెప్టెన్‌గా ఎన్నికయ్యాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంటి సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు, చర్చలు వచ్చాయో.. ఎవరెవరు దగ్గరయ్యారు.. ఎవరెవరు దూరమయ్యారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X