ఇంచు కూడా దిగావో చంపేస్తా.. కిందకి దిగావో జనం చంపేస్తారు: అభికి హారిక హెచ్చరిక
బిగ్ బాస్ హౌజ్ లో తెలివిగా గేమ్ ఎలా ఆడినా కూడా ఫిజికల్ టాస్కుల విషయానికి వచ్చేసరికి ప్రతిసారి అభిజిత్ ఫెయిల్ అవుతున్న విషయం తెలిసిందే. ఒక విదంగా ఫెయిల్ అవుతున్నాడు అనడం కన్నా అతని చేత కాదని పరువు తీసారు కొందరు కంటెస్టెంట్స్. అయితే ఈ సారి అభిజిత్ ఫిజికల్ టాస్కులో నెవర్ బిఫోర్ అనేలా టాలెంట్ ని బయటపెట్టి విమర్శలు చేసే వారికి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చాడు.

గతంలో పరువు పోయేలా చేసుకున్న అభిజిత్
ఫిజికల్ టాస్కులలో పెద్దగా కష్టపడకపోవడంతో గతంలో అభిజిత్ ని చాలా మంది తిట్టారు. అమ్మా రాజశేఖర్ ఏ రేంజ్ లో కౌంటర్స్ ఇచ్చాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అఖిల్ కూడా చాలా సార్లు పరువు తీశాడు. ఇక మంగళవారం ఎపిసోడ్ లో అభి గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక టాస్కును పూర్తి చేశాడు. దీంతో అతని స్నేహితులు హారిక లాస్య మనోడికి ప్రశంసలతో అభినందించారు

ఫెయిల్ అయిన సోహెల్
73వ ఎపిసోడ్ లో టాస్కులలో కంటెస్టెంట్స్ వారి సత్తా చూపించాల్సిన సమయం వచ్చింది. బిగ్ బాస్ హౌజ్ ని కమాండో ఇన్‌స్టిట్యూట్ గా మార్చగా కంటెస్టెంట్స్ ట్రైనింగ్ లో వారి కష్టాన్ని చూపించారు. డ్రిల్స్ పాకడం లాంటి ఫీట్లను కష్టపడి పూర్తి చేశారు. ఇక సోహేల్ వెయిట్ చాలెంజ్ ని స్వీకరించి అనుకోని విధంగా విఫలం అయ్యాడు. ఇక టాస్క్ అనంతరం అతను కంటతడి పెట్టాడు.

హగ్ ఇచ్చిన హారిక
పోల్ ని వాటేసుకుని కాళ్ళు చేతులు తలకిందులుగా వ్రేలాడదీయాలి. ఇలా 10నిమిషాలు ఉండాలి. ఆ టాస్కును స్వీకరించిన అభిజిత్ పోటీకి వెళ్లేముందు అభిజిత్ కి హగ్ ఇచ్చింది హారిక. దీంతో బలంగా వెళ్లిన స్వయంప్రకటిత పులి అనుకున్న సమయానికి మంకీ బార్ టాస్కును పూర్తి చేశాడు.
Recommended Video

కిందకు దిగావో జనాలు కూడా చంపేస్తారు
ఇక అతను అలా చేసినప్పుడు హారిక చాలా రెచ్చగొట్టింది.
ఇంచు కూడా దిగావో చంపేస్తాను.. కిందకు దిగావో జనాలు కూడా చంపేస్తారు అంటూ ఒక రకంగా అతనిలో స్ఫూర్తిని నింపింది. ఇక ప్రతిసారీ ఫిజికల్ టాస్కులతో నెగిటివ్ కామెంట్స్ అందుకుంటున్న అభిజిత్ ఈ సారి డోస్ పెంచినట్లు అర్ధమయ్యింది. ఇక ఈ సారైనా నామినేట్ చేయకండి బాస్ అంటూ వివరణ కూడా ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











