మోనాల్ గుట్టు బయటపడింది.. దెబ్బకు అఖిల్ షాక్.. కళ్లు తెరిపించిన నాగార్జున
బిగ్ బాస్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కంటెస్టెంట్ల గుట్టు విప్పి వారి అసలు రంగను బయట పెట్టగలడు. కన్ఫెషన్ రూంలోకి పిలిచి వీడియోలు చూపించి అసలు స్వరూపాలను బయటపెట్టేస్తాడు. ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడమైనా, స్నేహాన్ని విడగొట్టడటమైనా ఇలా ఏదైనా చేయగలడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్‌లో కొందరికీ కొన్ని వీడియోలు చూపించాడు. అఖిల్ సోహెల్‌కు మోనాల్ చేసిన మోసాన్ని, మార్చి చెప్పిన మాట చూపించి కళ్లు తెరిపించాడు.

మోనాల్ అలా మార్చింది..
సోహెల్ నోయల్ మాట్లాడుకున్న మాటలను అఖిల్ దగ్గర చెప్పడంతో పెద్ద గొడవే అయింది. మామూలుగా సోహెల్ నోయల్ అంత సీరియస్ టాపిక్ ఏమీ మాట్లాడుకోలేదు.. అందులోనూ అఖిల్ గురించి చెడుగా ఏమీ చెప్పలేదు. కానీ తెలుగు అర్థం కానీ, టాపిక్ తెలియని మోనాల్ మాత్రం అఖిల్ వద్ద ఏదో వాగేసింది.

ఇద్దరికీ గొడవలు..
అలా మోనాల్ పెట్టిన చిచ్చుతో అఖిల్ సోహెల్ మధ్య దూరం పెరిగింది. అయితే చివరకు మళ్లీ కలిసి పోయారు. కానీ లోపల మాత్రం అలా ఒకటి ఉండిపోతుంది. అలా ఒకచోట విన్నది మరో చోట చెప్పొదని మోనాల్‌కు సోహెల్ ముద్దుగా చెప్పినా కూడా వినలేదు., తిరిగి సోహెల్‌నే ఇరికించే ప్రయత్నం చేసింది.

కళ్లు తెరిపించిన నాగ్..
నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున సోహెల్ అఖిల్‌కు మంచిగా కళ్లు తెరిపించాడు. మోనాల్ చేసిన రచ్చను కళ్లకు కట్టినట్టు చూపించాడు. కన్ఫెషన్ రూంలోకి పిలిపించి మరీ మోనాల్ మార్చిచెప్పిన వీడియోను చూపించాడు. అక్కడ ఆమె ఏదో విని.. అఖిల్‌కు చెప్పడంతో గొడవ మొదలైంది. అసలు నోయల్ సోహెల్ తన గురించి అంతగా ఏమీ మాట్లాడుకోలేదని అఖిల్‌కు తెలిసిపోయింది.

హెచ్చరించిన నాగ్..
అలా మాటలు మారడం, అర్దాలు మారాయి.. అర్దాలు మారడంతో అపార్దాలు పెరిగాయి.. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోండని నాగార్జున మంచిగా చెప్పాడు. దీంతో అపార్ధాలు తొలిగిపోయి అఖిల్ సోహెల్ ఒక్కటయ్యారు. మోనాల్ చేసిన రచ్చ తెలిసి అఖిల్ షాకైనట్టు కనిపిస్తోంది. ఇక నుంచైనా ఆమె చెప్పిన మాటలు వినకుండా ఉంటాడేమో చూడలి.


Click it and Unblock the Notifications











