సారీ భయ్యా.. నేను మీ వాడితో రోజు కొట్లాడుతున్నా.. అఖిల్ సోదరుడికి అభి సమాధానం
బిగ్ బాస్ హౌజ్ లో అభిజిత్ గేమ్ ఎలా ఆడినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గడం లేదు. పెద్దగా టెన్షన్ తీసుకోకుండా సింపుల్ గా ఉండే అభిని ఓ వర్గం జనాలు బాగానే లైక్ చేస్తున్నారు. ఆఖరికి హౌజ్ మెంట్స్ కుటుంబ సభ్యులు కూడా అతన్ని లైక్ చేస్తున్నారు అంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా అఖిల్ సోదరుడు అభిని పొగడడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం అతను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా..
బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుటి నుంచి కంటెస్టెంట్స్ లలో కొంత శత్రుత్వం, కొంచెం స్నేహం కూడా పెరిగింది. పరిస్థితులను బట్టి హౌజ్ లో వాతావరణాన్ని బట్టి తీరు మారుతోందనే చెప్పాలి. ముఖ్యంగా అభిజిత్, అఖిల్ ల మధ్య మోనాల్ తో మొదలైన ఫైట్ చాలా రోజులు కొనసాగింది. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా నడిచింది వ్యవహారం. ఇక మదర్ సెంటిమెంట్ తో కాస్త మార్పులు వచ్చాయి.

అందరూ అతని అభిమానులే..
అఖిల్ తల్లి రాగానే అభిజిత్ పలకరించిన విధానం ఆడియెన్స్ ని సైతం ఆకట్టుకుంది. ఆంటీ ఇది జస్ట్ గేమ్ మాత్రమే అంటూ చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. మోనాల్ సోదరి తప్పితే మిగతావాళ్ల కుటుంబ సభ్యులు చాలా వరకు అభిని లైక్ చేశారు. అరియానా ఫ్రెండ్ కూడా మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పేశాడు. అప్పుడే అర్ధమయ్యింది అభి ఫాలోయింగ్ ఏమిటో.

అఖిల్ సోదరుడు కూడా..
ఇక శనివారం ఎపిసోడ్ లో అఖిల్ సోదరుడు కూడా అభి గురించి పాజిటివ్ గా స్పందిస్తూ.. మీకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను మరొకసారి పలకరించిన నాగార్జున వారిని పిలిచి టాప్ కంటెస్టెంట్స్ గురించి అడిగాడు. ఇక మొదట సోహెల్ పేరు చెప్పిన అఖిల్ సోదరుడు బబ్లూ ఆ తరువాత అఖిల్ పేరు చెప్పి వెంటనే అభిజిత్ అనేశాడు.

మీ వాడితో రోజు కొట్లాడుతున్నా
అంతే కాకుండా నేను మీకు పెద్ద ఫ్యన్ ని అంటూ ఆప్యాయంగా మాట్లాడడంతో అభి కూడా అంతే ఆప్యాయంగా ఒక సమాధానం ఇచ్చాడు. లేచి నిలబడి దండం పెట్టిన అభి.. సారీ భయ్యా.. నేను మీ వాడితో రోజు కొట్లాడుతున్నా.. క్షమించండి అంటూ ఆన్సర్ ఇచ్చాడు. బబ్లూ కూడా ఇది గేమ్ లో భాగమే..అలాంటివి మనసులో పెట్టుకోము అంటూ కూల్ గా సపోర్ట్ చేశాడు. ఇక ఆ చర్చను చూసిన అఖిల్ చాలా సైలెంట్ అయిపోయాడు.


Click it and Unblock the Notifications











