వాళ్ళిద్దరికి హ్యాండ్ ఇచ్చిన అఖిల్.. ఎమోషనల్ విషయాలని లెక్క చేయకుండా..
ఇండస్ట్రీలో ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా మోసపోయినా ఒక సీక్రెట్ విషయం గురించి అవినాష్ బయటకు చెప్పాడు. గురువారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీక్రెట్ విషయాలని చెప్పాలని అనడంతో ప్రతి ఒక్కరు ఎవరికి తెలియని విషయాలను బయటపెట్టేందుకు ప్రయత్నం చేశారు. ఎక్కువగా కంటెస్టెంట్స్ వారి ఫ్యామిలికి సంబంధించిన విషయాలను గురించి చెప్పారు.
అరియానా కూడా తనకు జరిగిన ఒక యాక్సిడెంట్ గురించి బయటపెట్టింది. అయితే వారిద్దరూ ఎలాంటి విషయాలను బయటపెట్టిన కూడా అఖిల్ పెద్దగా ఆలోచించలేదు. గేమ్ ఈజ్ గేమ్ అంటూ ఆప్తుల నుంచి వచ్చిన లెటర్ ని ఇవ్వలేదు.ఇక అవినాష్ ఇండస్ట్రీలో జరిగిన ఒక మోసం గురించి చెప్పాడు. అయితే అది సీక్రెట్ కాదని ముందే ఆ విషయం తనకు కూడా చెప్పాడని లెటర్ ని క్రష్ చేశాడు అఖిల్.

అయితే మోనాల్, అరియానా స్టోరీలు విన్న తరువాత ఆల్ మోస్ట్ ఇద్దరు ఒకలాగే ఎమోషనల్ విషయాలను బయటపెట్టారు. కానీ అఖిల్ మాత్రం అరియానా సీక్రెట్ చెప్పమని అంటే మ్యాటర్ ఏటేతో వెలుతోందని కామెంట్ చేసి ఆమె లెటర్ ని మిషిన్ లో పడేశాడు. మోనాల్ కి మాత్రం లెటర్ ని ఇచ్చాడు. అఖిల్ తీసుకున్న నిర్ణయం అతనిపై కొంత ఎఫెక్ట్ చూపేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ అభిజిత్ తో విరోధం ఉన్నప్పటికీ అలా చేయలేదు అఖిల్. మరి ఈ నిర్ణయాలు రానున్న రోజుల్లో ఎలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











