బిగ్ బాస్ షోలో నేనే విన్నర్ అవుతాను.. అది నేను కోరుకుంటే మూర్ఖుడినే.. అఖిల్ కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షోలో బుధవారం (డిసెంబర్ 16) నాటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులను ఎమోషనల్ అయ్యేలా చేశాడు. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో సీనియర్ కంటెస్టెంట్లను తెచ్చి కూల్ చేయించిన బిగ్ బాస్ ఇక జర్నీ వీడియోలను చూపించి ఎమోషనల్ అయ్యేలా చేశాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో తమ ప్రయాణాన్ని చూసిన కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. అందులో అఖిల్ తన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ ప్రశంసలు..
టాప్ 5కి చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డావ్.. మీరు నవ్వరని ఎంతో మంది అన్నారు. కానీ మీ గురించి బిగ్ బాస్‌కు అంతా తెలుసు.. మీరు ప్రతీ పరిస్థితిలో మీ ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారంటూ బిగ్ బాస్ అఖిల్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఎమోషనల్ కామెంట్స్..
జర్నీ వీడియోను చూసిన అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. అందులో మోనాల్‌తో గడిపిన మధుర క్షణాలే ఎక్కువగా కనిపించాయి. ఇక సోహెల్, మెహబూబ్‌లతో కలిసి ఉన్న సీన్స్, అభిజిత్ హారికలతో గొడవలు ఇలా అన్నీ కలిసి అఖిల్ జర్నీని సంపూర్ణం చేశాయి. వాటన్నంటిని చూసి అఖిల్ ఎమోషనల్ అయ్యాడు.

బంకమట్టిలం..
ఇక్కడ మేమంతా బంకమట్టిలా వచ్చాం.. మంచి మనిషిలా మారి వెళ్తామా? లేదా మళ్లీ మట్టి ముద్దల్లా కిందపడిపోతామా? అన్నది వారి వారి చేతుల్లోనే ఉంది. నా వరకు నేను వంద శాతం టాస్కుల్లో ఇచ్చాను.. కష్టపడి ఆడాను.. ప్రయత్నం అయితే చేయగలను కానీ టాస్క్‌లో ఓడిపోతే తన తప్పు కాదని అఖిల్ చెప్పుకొచ్చాడు.
ఇంకా మూర్ఖుడినే..

ఇంకా మూర్ఖుడినే..
తాను ఇంట్లో ప్రేమ దొరక్కపోతే అలుగుతుంటాను.. కానీ బయటి నుంచి ఇంత ప్రేమ లభిస్తుంటే.. ఇంకా తాను ఇంట్లో ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను అంటే ఎంత మూర్ఖుడిని అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల ప్రేమకు పాదాభివందనంం చేశాడు అఖిల్.
నేను విన్నర్ అవుతాను..
బిగ్ బాస్ షోలో నేనే విన్నర్ అవుతాను అంటూ అఖిల్ ఓవర్ కాన్ఫిడెన్స్‌ను ప్రదర్శించాడు. షోలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే టాప్ 2లో ఉంటానని చెప్పినట్టు.. ఇప్పుడు బిగ్ బాస్ షోలో తానే విన్నర్ అవుతానని ఎంతో నమ్మకంగా చెప్పాడు. కానీ బయట మాత్రం వ్యవహారం వేరేలా నడుస్తోంది. అయితే చివరకు బిగ్ బాస్ టైటిల్ ఎవరు గెలుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











