పెళ్లి చేసుకోవడానికి రాలేదు.. మోనల్‌పై అఖిల్ ఫైర్.. తేడా కొడుతున్న ట్రాక్!!

బిగ్‌బాస్ మొదటి రెండు వారాల్లో ఎలాంటి ట్రాకులు, రహస్య బంధాలు, ప్రేమలు, ద్వేషాలు, అసూయలు ఏర్పడ్డాయో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా మోనాల్ కేంద్రంగా తిరిగిన ఈ ట్రాక్ అందర్నీ ఆకట్టుకుంది. మొదటి రెండు మూడు రోజులు ఏడుస్తూ విసిగించిన మోనాల్.. ఆపై అసలైన ఆట మొదలు పెట్టింది. అయితే నిజంగానే అది ఆటలో పార్టో లేక కావాలనే చేస్తుందో తెలియడం లేదు. ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2 లాంటి కాన్సెప్ట్ మాత్రం నడుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2
మోనాల్ చుట్టూ ఆ ఇద్దరూ..

మోనాల్ చుట్టూ ఆ ఇద్దరూ..

అభిజీత్ మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేద్దామని బిగ్ బాస్ ముందే ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జున మొదటి రోజే షాక్ ఇచ్చాడు.. మోనాల్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అభిజీత్ లాకయ్యాడు. అలా ఓ ట్రాక్‌కు సంబంధించి హింట్ ఇచ్చాడు. అయితే మధ్యలో టాస్క్ కారణంగా అఖిల్ లైన్‌లోకి రావడంతో ట్రయాంగిల్‌గా మారింది.

 ఎడమొహం పెడమొహంగా..

ఎడమొహం పెడమొహంగా..

అఖిల్ అభిజీత్ ఇద్దరూ మొదట్లో మంచి స్నేహితుల్లా ఉండేవారు. పక్క పక్క బెడ్స్‌లోనే పడుకునేవారు. అయితే రాను రాను వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. రా అని పిలవడంలో మా ఇద్దరికి గొడవ వచ్చిందని అభిజీత్ పైకి చెప్పినా.. లోపల మాత్రం కారణం వేరే ఉందని తెలుస్తోంది.

 టాస్క్‌లో అలా..

టాస్క్‌లో అలా..

ఉక్కు హృదయం అనే టాస్క్‌లో అభిజీత్ నమ్మించి మోసం చేయడాన్ని అఖిల్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే ఇంకా దూరంగానే ఉంటున్నాడు. కానీ మోనాల్ మాత్రం అభితో మళ్లీ క్లోజ్‌గానే మాట్లాడుతోంది. దీనిపై అఖిల్ బాగానే సీరియస్‌గా ఉన్నట్టు చెబుతోంది.

పసిగట్టిన గంగవ్వ..

పసిగట్టిన గంగవ్వ..


అఖిల్ మోనాల్ మాట్లాడుకోవడం లేదని ఇంటి సభ్యులకు గంగవ్వ చెప్పింది. అభిజీత్‌తో మోనాల్ మాట్లాడుతోందని అఖిల్ ఫీల్ అయ్యాడట.. అందుకే అఖిల్ దూరంగా ఉంటున్నాడని గంగవ్వ పసిగట్టింది. ఇదే విషయాన్ని అమ్మ రాజశేఖర్, అవినాష్‌లతో చెప్పేసరికి వారు షాక్ అయ్యారు.

పెళ్లి చేసుకోవడానాకి రాలేదు..

పెళ్లి చేసుకోవడానాకి రాలేదు..


ఇక అఖిల్‌తో మాట్లాడేందుకు మోనాల్ ప్రయత్నించింది. కొంచెం కూల్ అవ్వు.. కోప్పడకు అంటూ మోనాల్ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. తనకు కొంచెం టైం పడుతుంది.. వెంటనే మరిచిపోలేను.. కలవలేను అంటూ పెళ్లి చేసుకోవడానికి రాలేదు అంటూ మోనాల్‌పై అరిచాడు. మరి ఈ ట్రాక్‌లో తేడాలు వచ్చి.. మోనాల్ అభి వైపు పూర్తిగా వస్తుందా? అసలు ఈ ముగ్గురి మధ్య ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X