అఖిల్ మనసులో కుళ్లు.. మొత్తానికి అలా బయటపడింది!!
పదోవారంలో అఖిల్ సీక్రెట్ రూంలోకి వెళ్లాడు. ఇంటి సభ్యులు మెజార్టీ అభిప్రాయంలో అఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడంతో అఖిల్‌ను అలా సపరేట్‌గా ఉంటారు. అది ఎలిమినేషన్ అని ఇంటి సభ్యులు భావించారు. కానీ అఖిల్ సీక్రెట్ రూంలోకి వెళ్లాడని, ఎలిమినేట్ కాలేదని తెలిశాక అందరూ సంబరపడ్డారు. ఇలా సీక్రెట్ రూంలోకి వెళ్లిరావడంతో అఖిల్‌కు బంపర్ ఆఫర్ తగిలింది. పదకొండో వారానికి నేరుగా కెప్టెన్ అయ్యాడని నాగార్జున తెలిపాడు.

నామినేషన్స్ నుంచి సేవ్..
అలా నాగార్జున ఇచ్చిన ఆఫర్‌తో పదకొండో వారంలో కెప్టెన్ అయ్యాడు. నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు. ఎలాంటి టాస్కులు ఆడకపోయినా కెప్టెన్ అయిన అఖిల్.. పన్నెండో వారానికి కూడా కెప్టెన్ అవ్వాలని ప్రయత్నించాడు. ప్రయత్నించడంలో తప్పు లేదు కానీ తనకు మిగతా వాళ్లు సపోర్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం సమంజసం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కెప్టెన్సీ టాస్క్...
పదకొండో వారంలో కెప్టెన్సీ టాస్క్ అంటూ కాస్త డిఫరెంట్‌గా ఆట ఆడించాడు. ప్రతీసారి కెప్టెన్సీ టాస్క్ పోటీదారులు కెప్టెన్ అవ్వడానికి ఆటలు ఆడేవారు. కానీ ఈ సారి వారి తరుపును మిగతా కంటెస్టెంట్లు ఆడే అవకాశాన్ని ఇచ్చాడు. కెప్టెన్సీ పోటీ దారులు.. మిగతా కంటెస్టెంట్ల భుజాల మీద కూర్చోవాలి. ఎవరు ఎక్కువ సేపు అలా కూర్చుంటారో వారే కెప్టెన్ అని తెలిపాడు. అంటే ఎక్కువ సేపు మోస్తారో వారే విజేతలన్న మాట. అంటే ఇక్కడ అసలు పరీక్ష కూర్చునే వారిది కాదు..మోసే వారిది.

అఖిల్ ప్లానింగ్..
తనకు మద్దతు తెలపమని సోహెల్, అవినాష్ మోనాల్‌లను అఖిల్ ముందుగానే అడిగేశాడు. అలా అయితే హారిక, అభిజిత్‌లను లాస్య, అరియానాలు ఎలాగూ మోయలేరని పథకం వేశాడు అఖిల్. ఇక్క తన గెలుపు కోసం కాకుండా పక్కవారికి చాన్స్ రాకుండా.. వారిని ఎవ్వరూ భుజాలపై మోయకుండా ఉండేందుకు ప్రయత్నించాడు.

మోనాల్ ఇచ్చిన పంచ్..
అయితే ప్రతీ టాస్క్‌లో మోనాల్‌ను దూరంగా ఉంచే అఖిల్ ఈ సారి మాత్రం సాయం అడిగాడు. కానీ మోనాల్ చేయలేదు. హారికను తన భుజాలపై చివరి వరకు మోసింది. తనను తక్కువ అంచనా వేసిన అఖిల్‌కు బుద్ది చెప్పాలనో ఏమో గానీ ధృడ నిశ్చయంతో అలాగే నిల్చుంది. హారికను కెప్టెన్ చేసింది.

అఖిల్ కుళ్లు..
అయితే మోనాల్ తనకు సపోర్ట్ చేయకుండా హారికకు మద్దతు తెలపడంపై అఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మాట్లాడటానికి వచ్చిన మోనాల్‌ను కూడా వెళ్లిపో అనేశాడు. తనకు మద్దతు తెలపలేదన్న కుళ్లుతో అఖిల్ ఇమేజ్ దిగజారుతోందని.. దాని వల్ల మోనాల్ గ్రాఫ్ పెరుగుతోందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి మోనాల్ మొదటి సారిగా తన సత్తాను చాటింది.


Click it and Unblock the Notifications











