twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాపం అఖిల్ మొహం మాడిపోయినట్టుంది.. సోహెల్-మోనాల్ హాట్ పెర్ఫార్మెన్స్‌తో హార్ట్ ఎటాక్

    |

    బిగ్‌బాస్‌తో ఆటలంటే మామూలు విషయం కాదు. ఒక్కోసారి దగ్గర చేసినట్టే చేస్తాడు.. దగ్గరయ్యే సరికి విడగొట్టే ప్రయత్నమూ చేస్తాడు. అలా మనుషుల మధ్య రాగద్వేషాలు, ప్రేమలు పుట్టించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే బిగ్ బాస్ కర్తవ్యం. తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమో, అందులోని హాట్ పర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. కానీ ఓ ఇద్దరు, అందులో మరీ ముఖ్యంగా ఓ వ్యక్తికి మాత్రం బాగానే కాలినట్టు కనిపిస్తోంది.

    ట్రయాంగిల్ స్టోరీ..

    ట్రయాంగిల్ స్టోరీ..

    బిగ్‌బాస్ షోపై హైప్ రావాలంటే కచ్చితంగా ఏదో తెలియని రహస్య బంధాలుండాలి. వాటిపై ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెరగాలి. అప్పుడు షోపై అందరికీ ఆసక్తి పెరుగుతుంది. గత సీజన్లో ఈ ఫార్మూలా బాగానే వర్కౌట్ అయింది. అందుకే ఇంట్లోకి వచ్చేముందే ఓ ట్రాక్ వేసేందుకు ప్లాన్ సిద్దం చేశారు. అయితే అది ట్రయాంగిల్ స్టోరీగా మలుపుతిరిగింది.

    మోనాల్ చుట్టూ ఆ ఇద్దరూ..

    మోనాల్ చుట్టూ ఆ ఇద్దరూ..

    మోనాల్ చుట్టూ అఖిల్, అభిజీత్ ఉండటం, ఆ ఇద్దరితోనూ మోనాల్ క్లోజ్‌గానే ఉండటం, అందులో మరీ ముఖ్యంగా అఖిల్ ఇంకాస్త ముందుకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరూ గొడవ పడటం, మళ్లీ కలిసి పోవడం, అభిజీత్‌తో మాట్లాడానికి సమయం లేదని మోనాల్ తప్పించుకోవడం చూస్తుంటే ఆమె మనసులో ఉన్నది కూడా స్పష్టం అవుతూనే ఉంది.

    గందరగోళంలో అభిజీత్..

    గందరగోళంలో అభిజీత్..

    అభిజీత్ మోనాల్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తుంటే.. అభిజీత్‌పై హారికపై మనసు పారేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని మోనాల్ గుట్టు రట్టు చేసింది. హారిక ఇష్టపడుతున్న విషయాన్ని పసిగట్టిన మోనాల్ అదే విషయాన్ని అభిజీత్‌తో చెప్పడంతో షాక్ అయ్యాడు. అసలు ఏం జరుగుతోందో తెలియన కన్ఫ్యూజన్‌లో అభి పడ్డాడు.

    ప్రేమదేశంలా..

    ప్రేమదేశంలా..

    అయితే మోనాల్ చుట్టూ వీరిద్దరు తిరగడం, ఆ ఇద్దరూ మాత్రం స్నేహితుల్లానే ఉండటంతో అందరికీ ప్రేమ దేశం సినిమా గుర్తుకు వస్తోంది. ఇక ఈ రోజు ప్రోమోలో చూపించినట్టుగా ఆమెకు తినేప్పుడు స్వరం తప్పితే నీళ్లు ఇవ్వడానికి ఇద్దరూ పోటీ పడ్డారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4 Episode 11 Highlights | Filmibeat telugu
    హాట్ పర్ఫామెన్స్‌తో..

    హాట్ పర్ఫామెన్స్‌తో..

    ఇక నేటి టాస్క్‌లో భాగంగా సోహెల్-మోనాల్ డ్యాన్సులతో దుమ్ములేపినట్టు కనిపిస్తోంది. వాన వాన వెల్లువాయో అనే పాటకు హాట్ హాట్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ హాట్ పర్ఫామెన్స్‌తో అఖిల్ గుండెకు చిల్లు పడ్డట్టు అయింది. మరి ఈ పర్పామెన్స్‌తో నిజంగానే అఖిల్ ఫీలయ్యాడా? అన్నది నేటి ఎపిసోడ్‌లో తెలియనుంది.

    English summary
    Bigg Boss 4 Telugu Akhil Got Feel By Seeing Sohel And Monal Hot Dance, Akhil Monal And Abijeet Triangle Love Story Goes Viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X