పాపం అఖిల్ అలా బుక్కయ్యాడు.. మెహబూబ్ కంటే దారుణం అంటూ ఆడేసుకుంటోన్న నెటిజన్లు

బిగ్‌బాస్ అంటేనే అదో ఓ రకమైన చిత్రమైన ఆట. ఎప్పుడు ఎవరి నిజ స్వరూపాలు బయటకు వస్తాయో చెప్పలేం. గిచ్చి మరీ కయ్యానికి ఆహ్వానించేలా చేస్తాడు బిగ్ బాస్. ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉండే తగువులు పెట్టి తమాషాలు చేస్తాడు. కోపం రాని వాడికి కోపం వచ్చేలా చేస్తాడు.. మంచితనం ముసుగు కప్పుకుని ఉండేవాడిని బయటకు లాగేస్తాడు. నిన్నటి ఎపిసోడ్‌లోనూ ఇలాంటి ఓ ఘటనే జరిగింది.

రేషన్ మేనేజర్..

రేషన్ మేనేజర్..

నాల్గో సీజన్‌లో కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఇంట్లోని సరుకుల లెక్క తేల్చేందుకు రేషన్ మేనేజర్ అనే పదవిని పెట్టాడు. ఇంట్లో ఎంత సామాను ఉంది.. ఏ ఏ సామాన్లు ఉన్నాయి.. ఇంకా ఏమేమీ అవసరం అనేవి చూసుకోవడం ఇతని బాధ్యత. అయితే నాల్గో వారంలో రేషన్ మేనేజర్‌గా అఖిల్ వ్యవహరిస్తున్నాడు.

కన్ఫెషన్ రూంలో టాస్క్..

కన్ఫెషన్ రూంలో టాస్క్..

కన్ఫెషన్ రూంలోకి అఖిల్‌ను పిలిచిన బిగ్ బాస్ అతనికి తెలివికి పరీక్ష పెట్టాడు. మొత్తంగా 3200 పాయింట్లు ఇచ్చి.. పదహారు మంది కంటెస్టెంట్లకు ఒక్కో ఐటెం సెలెక్ట్ చేయాలి.. ఎవరికి ఏ ఐటెం సెలెక్ట్ చేస్తే అది వారికి మాత్రమే సొంతమని తెలిపాడు. అయితే ఈ టాస్క్‌లో అఖిల్ పూర్తిగా విఫలమయ్యాడు.

తనవాళ్లకు మాత్రమే..

తనవాళ్లకు మాత్రమే..

పదహారు మంది కంటెస్టెంట్లకు ఐటెంలు సెలెక్ట్ చేయాల్సి ఉండగా.. కేవలం తనకు నచ్చిన, ఇష్టమైన వ్యక్తులకు మాత్రం ఐటెంలను రాశాడు. లాస్యకు మ్యాంగో పికల్, నోయల్‌కు బ్రెడ్, మెహబూబ్‌కు అటుకులు, గంగవ్వకు కార్న్, అమ్మ రాజశేఖర్‌కు బేసన్, నూడుల్స్ సోహెల్‌కు సెలెక్ట్ చేశాడు.

అయోమయపు అఖిల్..

అయోమయపు అఖిల్..


అఖిల్‌కు టాస్క్ సరిగ్గా అర్థం కాలేదో లేదా అభి, అభి గ్యాంగ్ పట్ల ఉన్న ద్వేషమో గానీ టాస్క్ మాత్రం నిండా ముంచేశాడు. మిగతా హౌస్ మేట్స్‌కు ఎలాంటి ఐటెంలు పెట్టలేదు. పైగా చికెన్ ధర ఎక్కువ అంటూ ఏదేదో కవర్ చేశాడు. పైగా అందరూ పంచుకోవచ్చు కదా అని తన అమాయకత్వాన్ని బయటపెట్టాడు.

Recommended Video

Check First Look Poster: Koratala Siva Releases Nithiin-Yeleti Film Title And Poster
నెటిజన్ల ట్రోలింగ్..

నెటిజన్ల ట్రోలింగ్..

అఖిల్ తన బుర్రను వాడలేదని, మోహబూబ్ కంటే మరీ ఘోరంగా ఉన్నాడని నెటిజన్లు దారుణంగా ఆడేసుకుంటున్నారు. కావాలని అభికి, అభి ఫ్రెండ్స్‌కు ఫుడ్ ఐటెంలను సెలెక్ట్ చేయలేదని, అఖిల్ స్వార్థం ఇలా బయట పడిందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంలో నాగార్జున ఏదైనా అంటాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X