కెప్టెన్సీ కోసం మరీ ఇంత కక్కుర్తి అవసరమా.. అఖిల్ అయితే మరీ దారుణం

నామినేషన్స్ మొదలయ్యాయి అంటే చాలు ఎక్కడ లేని కోపాలు అసలు రంగులు బయటకు వస్తాయి. ఇక బిగ్ బాస్ మంగళవారం ఎపిసోడ్ లో మాత్రం గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ మధ్య అనుకోని వివాదాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య ఉన్న స్వార్థం కూడా చాలా క్లియర్ గా అర్ధమయ్యింది ..ఆగ్రహంతో వారి లూప్ హోల్స్ ని వారే బయట పెట్టుకున్నారు..

ఆ పోస్ట్ అనేది విలువైనదే కానీ..

ఆ పోస్ట్ అనేది విలువైనదే కానీ..

బిగ్ బాస్ లో కెప్టెన్సీ పోస్ట్ అనేది విలువైనదే కానీ ఆ పోస్ట్ దొరికినంత మాత్రానా బగ్ బాస్ విన్నర్ అయిపోరని అందరికి తెలిసిన విషయమే. గతంలో ఎప్పుడు లేని విధంగా కెప్టెన్ అవ్వడానికి మెహబూబ్, అఖిల్ పడిన కక్కుర్తి బిగ్ బాస్ కు సైతం చిరాకు తెప్పించింది. దీంతో అప్పటివరకు పడిన కష్టమంతా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది.

అసలు డ్రామా అప్పుడే మొదలైంది

అసలు డ్రామా అప్పుడే మొదలైంది

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఈ సారి చాలా కొత్తగా అనిపించింది. పక్కనున్న వారి బంతి తీసుకొని బాస్కెట్ లో వేయాలని చెప్పడంతో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. అయితే చివరికి టాస్క్ లో అఖిల్ మెహబూబ్ సోహైల్ నిలవడంతో ముగ్గురిలో ఎవరో ఒకరు కెప్టెన్ అవ్వాలని మీరే డిసైడ్ చేసుకోవాలని చెప్పడంతో అసలు డ్రామా అప్పుడే మొదలైంది.

మెహబూబ్ కోసం తప్పుకున్న సోహైల్

మెహబూబ్ కోసం తప్పుకున్న సోహైల్

మెహబూబ్, సోహైల్ ఎంత క్లోజ్ గా ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే మొదట్లో మెహబూబ్ , సోహైల్ కెప్టెన్సీ కోసం త్యాగం చేసిన విషయం తెలిసిందే. అందుకే ఈ సారి అతను కూడా అదే తరహాలో హెల్ప్ చేసి అఖిల్ ని కూడా డ్రాప్ అవ్వమని సలహా ఇచ్చాడు. కానీ అఖిల్ అందుకు ఒప్పుకోలేదు. ఆటలో అలాంటి ఎమోషన్స్ ఉండకూడదు అంటూ గట్టిగానే వాదించాడు.

మరీ ఈ రేంజ్ లో కక్కుర్తి పడలా?

మరీ ఈ రేంజ్ లో కక్కుర్తి పడలా?

మెహబూబ్ అయితే తాను ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నాను అంటూ కాస్త ఇమ్యూనిటీ లభిస్తే సేవ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినా కూడా అఖిల్ అందుకు ఒప్పుకోలేదు. కెప్టెన్సీ కోసం మరీ ఈ రేంజ్ లో కక్కుర్తి పడలా అనే రేంజ్ లో వాదించుకున్నారు. హౌజ్ మెంట్స్ కూడా ఎందుకు చిల్లరగా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేసే వరకు వచ్చింది వారి పరిస్థితి. ఇక బయట జనాలు ఇంకా ఏ రేంజ్ లో అనుకుంటున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాస్క్ అయితే రద్దు అయ్యింది. మరి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X