వామ్మో.. అఖిల్ తడిగుడ్డతోనే గొంతు కోసేలా ఉన్నాడు.. మొన్న మోనాల్, నేడు అభిజిత్
బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్స్ మధ్య వివాదాల జోరు రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. సాధారణంగా ఇలాంటి షోలో ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో మోసాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఊహించని విధంగా రంగులు మార్చేస్తు ఉంటారు. ఇక పది వారాలు గడిచిన తరువాత బిగ్ బాస్ లో అసలైన ఊసరవెల్లి రంగులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అఖిల్ అయితే తడిగుడ్డతోనే గొంతుకోసేలా ఉన్నాడనే కామెంట్స్ వస్తున్నాయి.

అభిజిత్ vs అఖిల్
సోమవారం ఎపిసోడ్ లో అఖిల్ నామినేషన్ విషయంలో చాలా తెలివిగా అడుగులు వేశాడు. అభిజిత్ ని నామినేట్ చేశాడు. అంతా బాగానే ఉంది కాని.. అంతకు ముందు అతను ట్రావెల్ చేసిన విధానం చూస్తే ఎవరైనా సరే అఖిల్ అలా చేయడు అనుకుంటారు. గత వారం నుంచి అతను తీసుకుంటున్న నిర్ణయాలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి.

ట్రయాంగిల్ లవ్ స్టొరీ తప్పితే..
అఖిల్ ఎక్కువగా ఫోకస్ అయ్యింది మోనాల్ ప్రేమ కథతోనే. అభిజిత్ కి పోటీగా ఉంటూ మోనాల్ ని తన వైపుకు తెలివిగా లాగేసుకున్న ఘనత అతనిది. ట్రయాంగిల్ లవ్ స్టొరీ తప్పితే అఖిల్ బిగ్ బాస్ లో హైలెట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఇక అది రొటీన్ అనుకున్నాడో ఏమో గాని ఇప్పుడు తన నిర్ణయాలను మార్చుకున్నట్లు తెలుస్తోంది.

ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్.. టాస్క్ ఈజ్ టాస్క్
ముందు మోనాల్ ని వీలైనంత వరకు సేవ్ చేయడానికి ప్రయత్నం చేసిన అఖిల్ ఆ తరువాత ఆమెనే నామినేట్ చేసి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇక మొన్నటివరకు అభిజిత్ తో స్నేహమంటే ఇదేరా అనే రేంజ్ లో బిల్డప్ ఇచ్చి ఇప్పుడు ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్.. టాస్క్ ఈజ్ టాస్క్' అంటూ అభిజిత్ తలపై బాటిల్ పగలగొట్టాడు. ఇక నా గేమ్ నేను జాగ్రత్తగానే ఆడతా బ్రదర్ అని అభిజిత్ కౌంటర్ ఇవ్వగా.. ఇది నీ గేమ్ కాదు అనే డైలాగ్ సీరియస్ అయ్యాడు అఖిల్.

అందరి టార్గెట్..అరియానా?
హౌజ్ లో ఇప్పుడు అరియానా అందరికి ఒక టార్గెట్ అయినప్పటికీ అఖిల్ తో జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అయ్యారు. మోనాల్ నమ్మించి మోసం చేశాడని అందరికి ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక అభిజిత్ తో మంచిగా ఉన్నట్లే ఉండి రెండురోజులకే ప్లాన్ చేంజ్ చేశాడు. చూస్తుంటే నెగిటివ్ అయినప్పటికీ హౌజ్ లో హైలెట్ అవ్వాలని అఖిల్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమయ్యింది. మరి ముందు ముందు ఎలాంటి అడుగులు వేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











