అవినాష్ లేడు కాబట్టి నీ మీద రైట్స్ నాకే ఉన్నాయి.. అరియానాపై అఖిల్ మన్మథ బాణాలు

బిగ్ బాస్ హౌజ్ లో ఈ మధ్య గోడవల కంటే ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ దర్శనమిస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో మోనాల్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసినప్పటికీ అందులో లవ్ సీన్స్ ఎన్ని ఉన్నా కూడా చివరకు గొడవకు దారి తీసేవి. ఇక అఖిల్ ఫైనల్స్ లోకి వెళ్లినప్పుటి నుంచి చాలా మార్పు వచ్చింది. మోనాల్ బోర్ కొట్టేసిందో ఏమో గాని మిగతా వారితో మాత్రం చాలా రొమాంటిక్ గా మాట్లాడేస్తున్నాడు. ఇక అరియానాతో సోమవారం అతను మాట్లాడిన విధానం నెవర్ బిఫోర్ అనేలా ఉంది.

పులిహోర రాజా ట్యాగ్ అతనికే..

పులిహోర రాజా ట్యాగ్ అతనికే..

హౌజ్ లో పులిహోర రాజా ఎవరో ఇటీవల అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది. అవినాష్ కామెడీలోనే వేరే అమ్మాయిలతో రొమాంటిక్ గా నవ్వుతూ కనిపించగానే అతన్ని పులిహోర రాజా అనేవారు. అయితే ఆ తరువాత అఖిల్ గుట్టు బయటపడటంతో ప్రతి ఒక్కరు అతనికి పులిహోర రాజా ట్యాగ్ ఇచ్చేశారు. అయినా కూడా అఖిల్ ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్లే బాయ్ వేషాలు..

ప్లే బాయ్ వేషాలు..

మోనాల్ తో చాలా రోజులు రొమాంటిక్ గా ఉన్న అఖిల్ ఇటీవల ఎలిమినేషన్స్ లో ఆమెతో గొడవలు ఎక్కువవ్వడంతో కాస్త గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఆమె బోర్ కొట్టిందో ఏమో గాని ఒకవైపు అరియానను మరోవైపు హారికను లైన్ లో పెడుతున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా తనలోని ప్లే బాయ్ వేశాలను బయట పెడుతున్నాడు.

మన్మథ బాణాలు వదులుతూ..

మన్మథ బాణాలు వదులుతూ..

ఎలిమినేషన్ లో ఉన్నప్పుడు నిత్యం ఎదో ఒక పాయింట్ లో డల్ గా కనిపించిన అఖిల్ రీసెంట్ గా టికెట్ టూ ఫినాలే లభించడంతో అప్పటి నుంచి చాలా సరదాగా కనిపిస్తున్నాడు. ఇక బెడ్ రూమ్ లో అరియానా టచ్ అప్ చేసుకుంటూ ఉండగా ప్రేమ బాణాలు గట్టిగానే వదిలాడు. అవినాష్ లేడు కాబట్టి ఫుల్ రైట్స్ నాకే ఉన్నాయి. ఎలాంటి సహాయం కావాలన్న కూడా నన్నే అడగచ్చు అంటూ అరియానాతో ప్రేమగా మాట్లాడాడు.

14వారం ఎఫెక్ట్ కదా

14వారం ఎఫెక్ట్ కదా

చిటికె వేస్తే చాలు నీ ముందు ఉంటాను అనగానే అంతా బాగానే ఉంది కదా అంటూ అరియానా కూడా రొమాంటిక్ టచ్ ఇచ్చింది. దీంతో.. అలా చూడకు నీ హావభావాలకు ఇంకా పడిపోతున్నానని అఖిల్ మరో షాక్ ఇచ్చాడు. మనం బ్రేక్ ఫాస్ట్ డేట్ కు వెళదామా అంటూ వెంటవెంటనే మాటల డోస్ పెంచాడు అఖిల్. ఇక అఖిల్ వేషాలు చూసి 14వారం ఎఫెక్ట్ కదా అంటూ పంచ్ వేసింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
ఆ విషయంలో హార్ట్ అవుతాను

ఆ విషయంలో హార్ట్ అవుతాను

అది కాదు.. నీ పై ఎప్పటి నుంచో ఒక ఎఫెక్ట్ ఉంది. కానీ చెప్పాలి అంటే ఒకలాంటి బయం వచ్చేస్తది. అందుకే ఇప్పుడు ధైర్యం చేసుకొని మాట్లాడుతున్నాను. మెంటాలిటీ కలవడం వలన ఇలాంటి పర్సన్ కావాలని అనిపిస్తది. కానీ నువ్ బయట ఎవరో ఉన్నావని చెప్పావు కాబట్టి ఇంతకంటే ఎక్కువ వెళ్లలేను అని అఖిల్ అరియానకు వివరణ ఇచ్చాడు. ఒకవేళ బయట ఎవరు లేకపోతే చాలా హ్యాపీ అంటూనే..ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం హార్ట్ అవుతానని పులిహోర కలిపాడు అఖిల్ బాబు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X