బెదిరించి హగ్గులు.. అడుక్కుని ముద్దులు.. అఖిల్ వ్యవహారం మామూలుగా లేదుగా!
బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో పులిహోర కలపడం, ట్రాకులు వేయడం ఎంతగా క్లిక్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మొదటి రోజు నుంచే ట్రాకులు వర్కవుట్ చేయాలనే ఉద్దేశ్యంతో కనెక్షన్ గేమ్‌ను పెట్టాడు. అలా మొదటి నుంచి ఇప్పటి వరకు కలిసున్న కనెక్షన్ జంట హారిక అభిజిత్‌లదే. కానీ ఆ బంధానికి ఇప్పుడు బీటలు వారినట్టు కనిపిస్తోంది. మోనాల్ అభిజిత్ ట్రాక్ మొదటి నుంచి బాగానే క్లిక్ అయింది. అయితే మధ్యలో అఖిల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఈ ట్రయాంగిల్ ట్రాకు ఇప్పటికీ ఓ వింతగానే ఉంది.

మోనాల్ చుట్టే వ్యవహారం..
అయితే బిగ్ బాస్ షోలో పులిహోర వ్యవహారం మోనాల్ చుట్టే తిరిగింది. అభిజిత్ అఖిల్ మోనాల్ ట్రయాంగిల్ సరిపోదని.. అవినాష్ కూడా మధ్యలో మోనాల్‌కు పులిహోర కలపడం ప్రారంభించాడు. అలా A అనే అక్షరంతో కొన్ని వారాలు లాక్కొచ్చారు. ఆ విషయంలో ఈ మధ్యఓ క్లారిటీ వచ్చింది. మోనాల్ మనసులో ఉంది తానేనని ఆ ఏ అంటే అభిజిత్ అని తనతో చెప్పిందట మోనాల్.

అఖిల్ చేష్టలు ఇలా..
అయితే మోనాల్‌కు అభిజిత్ దూరంగా ఉండటం ప్రారంభించిన క్షణం నుంచి అఖిల్ మరింత దగ్గరయ్యాడు. అయితే అఖిల్ మాత్రం అందరితోనూ ఈ మధ్య క్లోజ్‌గానే ఉంటున్నాడు. అరియానా, హారికలతో పులిహోర కలపడం ప్రారంభించాడు. ఇదే విషయంలో నాగార్జున ముందు బుక్కయ్యాడు. హారిక అరియానా అవినాష్ ఇలా అందరూ కలిసి అఖిల్‌ను బుక్ చేశారు.

పులిహోర రాజా..
అరియానా, హారికలతో పులిహోర కలుపుతున్నాడని అవినాష్ నాగార్జున ఎదుట చెప్పాడు. ఇన్నాళ్లూ తనను పులిహోర రాజా అన్నారు... కానీ అఖిలే పులిహోర కలుపుతాడు.. అఖిలే నెంబర్ వన్ అంటూ అవినాష్ పరువుదీశాడు. దీనికి తగ్గట్టే అఖిల్ చేష్టలు కూడా ఉన్నాయి. ఈ వారంలో అఖిల్ మరీ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాడు.

ముద్దు కావాలని..
మొన్నటి ఎపిసోడ్‌లో రాణిగా ఉన్న హారికకు సోహెల్ ముద్దు పెట్టాడు. అయితే తనకు కూడా ముద్దు పెట్టమని అఖిల్ మారాం చేశాడు. రాణిగా ఉన్నప్పుడు అలా ముద్దు పెట్టకూడదని, కావాలంటే తరువాత ఇస్తానని హారిక సర్దిచెప్పింది. అయితే ఈ వారంలో హారికకు హగ్గులు బాగానే ఇస్తూ క్లోజ్ అవుతున్నాడు.
Recommended Video

మోనాల్‌తో హగ్గులు..
నిన్నటి టాస్క్‌లో మోనాల్ రాణిగా వ్యవహరించింది. తనలో ఉన్న నెగెటివ్, పాజిటివ్ పాయింట్ చెప్పమని మంత్రిగా ఉన్న అఖిల్‌ను కోరింది. రాణి, మంత్రిగా ఉన్న ఆ ఇద్దరూ ముచ్చట్లు అయితే బాగానే పెట్టుకున్నారు. గార్డెన్ ఏరియా నుంచి లోపలకి వెళ్తున్న మోనాల్‌ను బెదిరించి మరీ వెనక్కి పిలిచాడు. హగ్గు ఇవ్వవా అంటూ మోనాల్‌ను స్వీట్‌గా అడిగేశాడు. ఇలాంటి వాటిలో ముందుండే మోనాల్.. అఖిల్‌కు ఘాడంగా హగ్ ఇచ్చింది. మొత్తానికి అఖిల్ మాత్రం అందరితో పులిహోర కలిపేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











