పాపం అఖిల్ మళ్లీ బుక్కయ్యాడు.. ఆ పదం డిక్షనరీలో కూడా దొరకడం లేదట!!

బిగ్‌బాస్ షో ప్రారంభమై ఐదో వారాలు గడిచిపోయాయి. ఆరో వారం కూడా ముగిసేందుకు వచ్చింది. ఇక నేటి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున వచ్చి ఒక్కొక్కరికి క్లాస్ పీకేలానే ఉన్నాడు. ఆ విషయం కాసేపు పక్కన పెడితే.. నిన్న ఓ ఘటన జరిగింది. మెహబూబ్ ఏదో అన్నాడని, అఖిల్ అలిగిపోయాడు. ఒక సోహెల్ పాపం బుజ్జగించేపనిలో పడ్డాడు. ఆ సమయంలో అఖిల్ ఓ పదాన్ని ఉచ్చిరించాడు. అయితే ఆ పదం డిక్షనరిలో కూడా దొరకడం లేదట. అలా అఖిల్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

పుష్ అప్స్ రౌండ్..

పుష్ అప్స్ రౌండ్..

మామూలుగా నిన్నటి ఎపిసోడ్ టీవీఎస్ అపాచీని ప్రమోట్ చేసేందుకు ఓ టాస్క్‌ను ఇచ్చారు. రేజర్ ఆఫ్ ది హౌస్ అంటూ అందర్నీ ఓ ఆట ఆడించాడు. అందులో భాగంగా మొదటి రౌండ్‌లో అందరూ పుష్ అప్స్ కొట్టాలని టాస్క్ ఇచ్చాడు. ఆగకుండా చివరి వరకు ఎవరు కొడతారే వారు సెకండ్ రౌండ్‌కు సెలెక్ట్ అవుతారని అన్నాడు.

ఆ విషయంలో..

ఆ విషయంలో..

అయితే అఖిల్‌కు నాగార్జున ఓసారి పుష్ అప్స్ కొట్టే టాస్క్ ఇచ్చాడు. వంద కొట్టమంటే 76 వరకు కొట్టినట్టున్నాడు. కానీ నిన్నటి ఎపిసోడ్ ‌లో 101 కొట్టేశానని చెప్పాడు. అయితే అది విని మెహబూబ్ షాక్ అయ్యాడట. నువ్ ఎలా వంద కొట్టావ్ అని ప్రశ్నించాడట. అదే విషయాన్ని దివి దగ్గర కూడా మాట్లాడట.

సోహెల్‌తో చెప్పుకొంటూ..

సోహెల్‌తో చెప్పుకొంటూ..

ఇక మెహబూబ్ చేసిన పనికి సోహెల్‌తో చెబుతూ అఖిల్ బాధపడ్డాడు. ఇలా చేస్తాడనని అస్సలు అనుకోలేదు. అంటే వాడికంటే ఎక్కుక కొట్టలేమని అనుకుంటున్నాడా? అలా ఎప్పుడు అనుకోవద్దంటూ సోహెల్‌తో చెప్పుకొచ్చాడు. ఆ తరువాత మెహబూబ్‌ను అఖిల్ వద్దకు తీసుకొచ్చి గొడవను సద్దమణిగేలా చేసేందుకు సోహెల్ ప్రయత్నించాడు.

సారీ చెప్పిన మెహబూబ్..

సారీ చెప్పిన మెహబూబ్..


క్యాజువల్‌గానే చెప్పాను.. నువ్ చేశావ్ అంటే ఆశ్చర్యం కలిగింది.. అంటూ మెహబూబ్ సారీ చెప్పాడు. అయినా కూడా అఖిల్ వినలేదు. అలాగే మాట్లాడకుండా ఉన్నాడు. మెహబూబ్ చేసిన దానికి సోహెల్‌ను కలిపి అనేశాడు. మీరెవరు మీ గురించి ఎందుకు బాధపడాలి.. నా అనుకున్న వాళ్లు నన్ను ఏమైనా అంటే ఫీలవుతా ఇలాగే ఉంటా మాట్లాడితే మాట్లాడండి లేకుంటే లేదు అని అఖిల్ ఫీల్ అయ్యాడు.

Recommended Video

Keerthy Suresh's Aina Ishtam Nuvvu: Natti Kumar Slams Chanti Addala
ఆ పదం మాత్రం..

ఆ పదం మాత్రం..

అఖిల్ సోహెల్ సంభాషణలో ఓ పదం మాత్రం అందర్నీ ఆకట్టుకుంది. మెహబూబ్ విషయం తెలిసి షాక్ అయ్యాను.. జైలామాలోకి వెళ్లాను అని అఖిల్ అంటాడు. అయితే ఇదేదో కొత్త పదం అనుకుని నెటిజన్లు డిక్షనరీలో వెతికారట. కానీ ఎక్కడా దొరకలేదట. తీరా అది జైలామా కాదేమో డైలామా అయి ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. అఖిల్‌పై మీమ్స్‌తో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X