కొట్లాటతో బిల్డప్ ఇచ్చి అర్ధరాత్రి కౌగిలింతలో మునిగిన అఖిల్, సోహెల్.. చీకట్లో ఆ సీన్ చూసి షాకైన మోనాల్
బిగ్ బాస్ హౌజ్ లో చాలా రోజుల తరువాత ఒక కొత్త తరహా సన్నివేశాలు దర్శనమిస్తున్నాయి. ఫైనల్స్ కు దగ్గరవుతున్న కొద్దీ కంటెస్టెంట్స్ లలో అసలు రంగులు చాలా ఈజీగా బయటపడుతున్నాయి. ఇక మొన్నటివరకు మంచి మిత్రులుగా ఉన్న వారు కూడా ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం ఎపిసోడ్ లో టాస్క్ ల విషయం మరోలా ఉంటే సోహెల్, అఖిల్ మధ్య జరిగిన సీన్స్ మరోలా ఉన్నాయి. ఇద్దరు అలకలతో మళ్ళీ కలవరేమో అన్నంతగా బిల్డప్ ఇచ్చి చివరికి కౌగిలించుకొని సైలెంట్ అయ్యారు.

ఇద్దరి మధ్య ఊహించని గొడవలు
బిగ్ బాస్ హౌజ్ లో కోపదారి మనిషి ఎవరంటే.. సోహెల్ అని అని అందరికి తెలిసిన విషయమే. ఈ మధ్య అఖిల్ కూడా తరచుగా తనలోని కోపాన్ని బయటపెడుతున్నాడు. అయితే ఇద్దరి మధ్య అనుకోకుండా గొడవలు జరుగుతున్నాయి. సాధారణంగా ఎవరికైనా సరే ఎలిమినేషన్స్ నుంచి గొడవలు పెరుగుతుంటాయి. కానీ వీరిద్దరికి మాత్రం వేరే విషయాల్లో విబేధాలు ఎక్కువవుతున్నాయి.

ఉదయమే పాజిటివ్ గా మాట్లాడుకొని..
మంగళవారం రోజు అర్ధరాత్రి అయినా కూడా హౌజ్ లో ఎవరు పెద్దగా నిద్రపోలేదు. ఇక సోహెల్ అయితే అఖిల్ తీరుపై ఒక రేంజ్ లో అసహనం వ్యక్తం చేశాడు. అంతకుముందే అరియానా పెట్టిన టెస్ట్ లో భాగంగా అఖిల్ గురించి పాజిటివ్ గా మాట్లాడిన సోహెల్ అతను నాకు హగ్ ఇస్తే చాలు అన్ని మరచిపోతా అన్నట్లు మాట్లాడాడు. అప్పుడు హగ్ ఇచ్చిన అఖిల్ నవ్వుకుంటూ మాట్లాడాడు.

అలకల నడుమ మోనాల్ మంతనాలు
అనంతరం మళ్ళీ తినే దగ్గర అఖిల్ బుంగమూతి పెట్టుకోవడంతో సోహెల్ కి ఏ మాత్రం నచ్చలేదు. ఇక సోహెల్ తినకుండా వచ్చేసి అలిగి కూర్చున్నాడు. మరోవైపు అఖిల్ హ్యాపీగా నిద్రపోయాడు. ఇక వీరి మధ్య ట్రయాంగిల్ క్వీన్ మోనాల్ మంతనాలు జరిపి ఇద్దరిని నార్మల్ స్టేజ్ లోకి తీసుకురావడానికి బాగానే ప్రయత్నం చేసింది.

అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు
ప్రతిసారి నేనే వచ్చి మాట్లాడాలా. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు. నేను ఎలా కనిపిస్తున్నాను అంటూ మోనాల్ దగ్గర తన అసహనం వ్యక్తం చేశాడు. నాకు మాత్రమే కాదు అఖిల్ కు కూడా బుద్ధి చెప్పు అలా ఉండకూడదు అని గట్టిగానే అరిచేశాడు సోహెల్. ఇక మోనాల్ తరువాత హారిక కూడా సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. మొన్న డ్రెస్ పూల్ లో పడేయడం గురించి గుర్తు చేస్తూ చాలా సీరియస్ అయ్యాడు సోహెల్.
Recommended Video

కొట్లాటతో బిల్డప్ ఇచ్చి..
ఇక అఖిల్, సోహెల్ ఇద్దరు కూడా మళ్లీ మాట్లాడుకోరేమో అన్నంతగా బిల్డప్ అయితే ఇచ్చారు. కానీ అర్ధరాత్రి ఎదురుపడగానే కౌగిలించుకొని నవ్వుకున్నారు. అలగడం, హగ్ చేసుకోవడం ఇద్దరికి కామన్ అయ్యిందని ఆడియెన్స్ కు కూడా అర్ధమయ్యింది. ఇక మోనాల్ అయితే చికట్లోనే వాళ్ళిద్దరిని చూసి ముసి ముసిగా నవ్వుకుంది. మరోసారి వీళ్లు గోడవపడితే మాత్రం వాల్యూను కోల్పోవడం కాయమని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











