Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్‌స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్‌కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
అలాంటివి నమ్మకండి.. అతనికి ఓట్లు వేస్తూనే ఉండండి.. అలీ రెజా భారీ మద్దతు
బిగ్ బాస్ షో ముగిసేందుకు వచ్చింది.. ఓటింగ్ ప్రక్రియ కూడా చివరి దశకు చేరింది. గత రెండు మూడు రోజులుగా ఎన్ని రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయో అందరికీ తెలిసిందే. ఇన్నాళ్లూ టాప్‌లో ఉన్న అభిజిత్ సడెన్‌గా రెండో స్థానంలోకి వచ్చాడంటూ.. అరియానా మొదటి స్థానంలోకి వెళ్లిందంటూ రకరకాల ఫేక్ వార్తలు వస్తూనేఉన్నాయి. అయితే వీటిని కొందరు నమ్ముతుంటారు.. ఇంకొందరు పట్టించుకోరు.
దుమ్ములేపుతోన్న ఓటింగ్..
నాల్గో సీజన్ ఫినాలె ఎపిసోడ్ కోసం ఓ వైపు రంగం సిద్దమవుతోంది. ఇటు తమ కంటెస్టెంట్‌ను గెలిపించుకోవడానికి అభిమానులు ఓట్లసునామిని క్రియేట్ చేస్తున్నారు. బయట యూట్యూబ్, వెబ్ సైట్లలో పోల్స్ రూపంలో ఓట్లు ఓ రేంజ్లో పడుతూ ఉంటే ఇక హాట్ స్టార్, మిస్డ్ కాల్స్‌లో ఎన్ని కోట్ల ఓట్లు పడి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
రూమర్లు ప్రచారం..
అయితే ఓ వైపు ఓట్లు వేయడంలో అభిమానులు బిజీగా ఉంటే.. కొందరు మాత్రం కొన్ని పుకార్లను లేవనెత్తే పనిలో పడ్డారు. అభిజిత్ ఆధిక్యంలో ఉంటాడని అందరికీ తెలిసిందే. కానీ మధ్యలోకి అరియానాను లాక్కొచ్చారు. అరియానా టాప్‌లో దూసుకుపోతోందని ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇలా వస్తోన్న వార్తలపై అలీ రెజా స్పందించాడు.
సోహెల్‌కు మద్దతు..
అలీ రెజా ముందు నుంచి సోహెల్‌కు మద్దతిస్తోన్నసంగతి తెలిసిందే. సోహెల్ టాప్ 5లోకి రావాలి, విన్న ర్ కావాలంటూ మొదటి నుంచి మద్దతు తెలుపుతూనే ఉన్నాడు. షోకి రావాలా? వద్దా? అని కూడా అలీ రెజా దగ్గర సోహెల్అభిప్రాయాన్ని తీసుకున్నాడట. అలా ముందు నుంచే సోహెల్‌కు అలీరెజా మద్దతు ఉంది.
ఆల్రెడీ విన్నర్..
నా దృష్టిలో నువ్ ఆల్రెడీ విన్నర్ అంటూ సోహెల్ జర్నీ వీడియోను షేర్ చేశాడు. నిన్నటి ఎపిసోడ్లో సోహెల్ తన ఏవీని చూస్తూ ఎమోషనల్ అయిన వీడియోను షేర్ చేస్తూ అలీ రెజా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. తన అభిప్రాయంలోసోహెల్ విజేత అయ్యాడట.
అలాంటివి నమ్మకండి..
మీ విలువైన ఈ ఒక్కరోజు, సమయాన్ని మన సోహెల్ కోసం త్యాగం చేయండి.. అనధికారిక పోల్స్, ఫేక్ అప్డేట్స్ను నమ్మకండి.. ఎవ్వరికీ వోటింగ్ గురించి ఎలాంటి నిజాలు తెలియవు.. మిస్ట్ కాల్స్ మీద ఫోకస్ పెట్టండి.. హాట్ స్టార్లోఓట్లు సరిగ్గా పడుతున్నాయా? లేదా? అని చెక్ చేసుకోండి.. విశ్రమించకండి. ఓట్లు వేస్తూనే ఉండండి. ఓట్లను విభజించుకోకండి.. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.. చివరగా నేను అదే చెప్పగలను అంటూ అలీరెజా చెప్పుకొచ్చాడు.