బాబు గారు చూస్తారట.. పనిష్‌మెంట్ ఇవ్వాలట.. అమ్మ రాజశేఖర్-అవినాష్ ముచ్చట్లు వైరల్
బిగ్ బాస్ ఇంట్లో గ్రూపులున్నాయని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఏ గ్రూపులో ఎవరున్నారో చెప్పడం కష్టమవుతంది. కానీ అరియానా అమ్మ రాజశేఖర్ అవినాష్ ఓ గ్రూపు.. లాస్య అభిజిత్ హారిక ఓ గ్రూపు అని అందరికీ తెలిసిందే. మెహబూబ్ అమ్మ రాజశేఖర్ గ్రూపులోనే ఉంటాడు. అఖిల్ అఖి గ్రూపులోకి వచ్చాడు. అఖిల్ మెహబూబ్ సోహెల్ ఫ్రెండ్ షిప్ ఏంటో అర్థం కాదు. ఇక మోనాల్ పరిస్థితి ఏంటో ఆమెకు తెలియాలి. నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం అమ్మ రాజశేఖర్ పెద్ద చిచ్చు రేపాడు.

తొమ్మిది వారంలో కెప్టెన్..
అమ్మ రాజశేఖర్ తొమ్మిదో వారంలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రింగులో రంగు అనే టాస్కులో అరియానా, హారికలతో పోటీ పడి గెలిచాడు. అయితే కెప్టెన్‌గా గెలిచాకే అమ్మ రాజశేఖర్ అసలు స్వరూపం బయటకు వచ్చింది. తన వాళ్లకు తక్కువ పని కేటాయించాడు. మిగతా వాళ్లపై ఉన్న పని అంతా మోపాడు. ఇంట్లో కొత్త రూల్స్‌ను పెట్టాడు.

జైలుకే అన్నాడు..
మైక్ ధరించకపోయినా, నిద్రపోయినా, తెలుగులో కాకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడితే జైలు శిక్ష విధిస్తానని చెప్పాడు. అది ఎంత సేపు అని చెప్పను గానీ జైలుకు మాత్రం వెళ్లాల్సిందే అన్నాడు. కానీ చివరకు మాత్రం తన శిక్షలను మార్చేశాడు. ఇంట్లో అందరూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టున్నారు. పనులు అప్పగించడంలో తేడా కొట్టడంతో అందరూ మాస్టర్‌పైకి అంత ఎత్తున లేచారు.

అభిజిత్‌తో గొడవలు..
అభిజిత్ అమ్మ రాజశేఖర్ మధ్య పెద్ద యుద్దమే జరిగింది. మాపై ఎక్కువ పని పడుతోంది.. మెహబూబ్‌ను కాస్తా కిచెన్ టీంలో షిప్ట్ చేయండని అమ్మ రాజశేఖర్‌ను అభిజిత్ అడిగాడు. దానికి రెచ్చిపోయిన అమ్మ రాజశేఖర్.. కెప్టెన్ నువ్వా నేనా.. మరి నువ్వే అన్ని నిర్ణయాలు తీసుకో అని కౌంటర్ వేశాడు.

ఇంగ్లీష్‌లో మాట్లాడేశాడు..
అమ్మ రాజశేఖర్ తీసుకున్న నిర్ణయాలు, జరిగిన గొడవలపై అభిజిత్.. హారిక, లాస్యలతో ముచ్చటించాడు. ఆ చర్చల్లో అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో అభిజిత్ ఇంగ్లీష్‌లో మాట్లాడాడు. అభిజిత్ మీరు తెలుగులోనే మాట్లాడండి అని బిగ్ బాస్ అనౌన్స్ మెంట్ ఇవ్వడంతో అమ్మ రాజశేఖర్ తెగ సంబరపడ్డాడు.

శిక్ష అంగీకరించడమో..
అభిజిత్ ఇంగ్లీష్‌లో మాట్లాడినందుకు అమ్మ రాజశేఖర్ చెప్పిన శిక్షకు ఒప్పుకోడేమోనని అందరూ అనుకున్నారు. ఇదే విషయంపై అవినాష్ అమ్మ రాజశేఖర్ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను చెప్పే పనిష్మెంట్ అభిజిత్ చేయడు..బాబు గారు దీన్ని చూస్తాడు వాడ్ని తిడతాడు అంటూ అమ్మ రాజశేఖర్ అవినాష్‌తో చెప్పుకొచ్చాడు. అవినాష్ కూడా అదే విధంగా మట్లాడుతూ.. బాబు గారు ఈ విషయంలో పనిష్మెంట్ ఇవ్వాలంటూ అభిజిత్ గురించి గుసగుసలాడారు. కానీ అభిజిత్ మాస్టర్‌కు షాక్ ఇచ్చాడు. మాస్టర్ చెప్పిన వాటిని గౌరవిస్తూ శిక్షను అనుభవించాడు.


Click it and Unblock the Notifications











