ఇదే రియల్ క్యారెక్టర్.. అందుకే ఇలా చేశాడట.. నోయల్‌పై అమ్మ రాజశేఖర్, అవినాష్ ఫైర్
ఎలిమినేట్ అయి వెళ్లే కంటెస్టెంట్ తన అభిప్రాయాలను చెప్పాలనుకుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు చెప్పలేని, సందర్భం రాని, మనసులో ఉన్న అభిప్రాయాలను చెప్పి వెళ్తాడు. అలా ఓ కంటెస్టెంట్ తను అనుకున్న విషయాలు చెప్పినప్పుదు మిగతా కంటెస్టెంట్లు వినాలి. అందులో నిజముందని భావిస్తే ఒప్పుకోవాలి లేదా అంటే వదిలేయాలి. అంతే గానీ వెళ్లిపోతోన్న మనిషిపైనే ఆరోపణలు చేయడం తగదు.

నోయల్ ఎలిమినేట్..
ఎనిమిదో వారంలో నోయల్ బయటకు వచ్చేశాడు. అయితే నామినేషన్‌లో నోయల్ లేనేలేడు. కానీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. త్వరగా కోలుకుని తిరిగి రావాలని బిగ్ బాస్ కోరాడు. కానీ అది వీలు కాదని తెలుసుకున్న నోయల్ ఆటకు దూరంగా ఉండిపోయాడు. నిన్నటి ఎపిసోడ్‌లో నోయల్ ఎలిమినేట్ అయినట్టు నాగార్జున అధికారికంగా ప్రకటించాడు.

అసలు నోయల్ బయటకు వచ్చాడు..
బిగ్ బాస్ షోలో మొదటి రెండు వారాల్లో నోయల్ ఎంత యాక్టివ్‌గా ఉన్నాడో అందరికీ తెలిసిందే. ఇంట్లో గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరించాడు. అందరి నోళ్లలో నానాడు. హడావిడి చేశాడు. ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కానీ నాగార్జున క్లాసు పీకడంతో బుద్దునిలా మారిపోయాడు.మంచితనానికి నిలువెత్తు నిదర్శనంలా మారాడు. కానీ నిన్న బిగ్ బాస్ స్టేజ్ మీద అసలు నోయల్ బయటకు వచ్చాడు.

ముగ్గురి ఫ్రెండ్స్‌ను..
అభిజిత్, లాస్య, హారికలు నోయల్‌కు బెస్ట్ ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురి గురించి చెబుతూ మీరంతా టాప్ 5 లో ఉండాలి.. ఉంటారు.. ఉండేలా చేస్తా అంటూ చాలా గొప్పగా చేశాడు. బయటి నుంచి తాను చేయాల్సిన సాయం చేస్తానని మాటిచ్చాడు.

అమ్మ రాజశేఖర్, అవినాష్‌లపై ఫైర్..
బిగ్ బాస్ ఇంట్లో కామెడీ చేసే అమ్మ రాజశేఖర్‌పై నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అందర్నీ కించపరిచేలా కామెడీ చేస్తున్నాడని అందరూ చెప్పారు. అవినాష్ కూడా ఎదుటి వారు హర్ట్ అయ్యేలా ఇమిటేట్ చేస్తున్నాడని అన్నారు. తన విషయంలోనూ తన బాధను కించపరిచేలా ఇమిటేట్ చేశారని ఆ ఇద్దరినీ నోయల్ టార్గెట్ చేశాడు. నిన్నటి ఎపిసోడ్‌లో నోయల్ ఆ ఇద్దరినీ ఓ రేంజ్‌లో కడిగిపాడేశాడు.

తాజాగా ఈ ఇద్దరూ..
అయితే ఆదివారం నాటి ఎపిసోడ్‌లోనూ ఇది బాగానే కంటిన్యూ అయినట్టు తెలుస్తోంది. అమ్మ రాజశేఖర్, అవినాష్ ఇంకా నోయల్ మీద ఆగ్రహాన్ని చల్లార్చుకోలేదని తెలుస్తోంది. కావాలనే చేశాడు.. అదే నోయల్ రియల్ క్యారెక్టర్.. టెంపరరీ ఫ్రెండ్ అని రాసినందుకు ఇలా చేశాడని అవినాష్, అమ్మ రాజశేఖర్‌లు నోయల్‌ను ఆడిపోసుకుంటున్నారు. వీరిని కూల్ చేసేందుకు నాగార్జున మంచి ఆటలే ఆడించినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











