ఈ ఓల్డ్ రొమాన్స్‌ను చూసి తట్టుకోగలరా.. కరాటే కళ్యాణిపై అమ్మ రాజశేఖర్ గురి!!
బిగ్‌బాస్ తెలుగు నాల్గో సీజన్‌కు మెల్లిమెల్లిగా ఆదరణ పెరుగుతోంది. ఇప్పటి వరకు ఒక ఎలిమినేషన్ (సూర్య కిరణ్), ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ( కమెడియన్ కుమార్ సాయి) జరిగింది. ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ కూడా జరిగింది. రెండో వారానికి గానూ మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. గంగవ్వ, నోయల్, మోనాల్, సోహెల్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి, అభిజీత్, హారిక, అమ్మ రాజశేఖర్ ఇలా తొమ్మిది మంది రెండో వారానికి నామినేషన్‌లోకి వచ్చారు.

హౌస్ అంతా సందడి..
ఇక మొదటి వారంలో కట్టప్ప అంటూ విసిగించిన బిగ్‌బాస్.. అందర్నీ బోర్ కొట్టించాడు. లేని కట్టప్పకు మూడేసి టాస్కులు పెట్టించి పదే పదే అవే రిపీట్స్ చేస్తూ మొదటి వారం మొత్తం నీరసంగా సాగేలా చేశాడు. అయితే రెండో వారం మాత్రం అందుకు భిన్నంగా సాగేట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రోమోలను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

హారిక హాట్ డ్యాన్సులు..
మొదటి నుంచి హారిక హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వస్తోంది. బిగ్ బాస్ ప్రారంభోత్సవ వేడుకల్లో కూడా పొట్టి పొట్టి బట్టలే వేసుకుంది. ఇంట్లోనూ అలానే తిరుగుతోంది. ఇక నేడు స్కర్ట్ వేసి కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది.

అలా రెచ్చిపోయిన దేవీ..
హౌస్‌లో అత్యంత స్ట్రిక్ట్, నిక్కచ్చిగా ఉండే కంటెస్టెంట్ దేవీ నాగవల్లి. ఇక ఈమె నేటి టాస్క్‌లో రెచ్చిపోయి నటించినట్టు కనిపిస్తోంది. పేపర్ మీద అమ్మాయి పేరు రాసినా దాన్ని కూడా వదలడు అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయింది. అయితే దాని వెనుకున్న మర్మం ఏంటో ఎపిసోడ్ చూస్తేనే తెలుస్తుంది.
Recommended Video

ఓల్డ్ రొమాన్స్..
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్ రొమాన్స్ వైరల్ అవుతోంది. కరాటే కళ్యాణి రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయాలని నోయల్ అడినట్టు కనిపిస్తోంది. ఇలా చేస్తూ కరాటే కళ్యాణిని లేపబోయి అమ్మ రాజశేఖర్ కింద పడ్డట్టు నాటకాలు ఆడాడు. ఇక కరాటే కళ్యాణి మాస్టర్‌ను తరిమేసరికి పారిపోయాడు. ప్రోమోలు అయితే బాగానే పేలుతున్నాయి.. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











