దివి గర్ల్ ఫ్రెండ్ అట.. అమ్మ రాజశేఖర్ ఆశలు మామూలుగా లేవు!!

బిగ్‌బాస్ షో ఏడో వారం కాస్త చప్పగానే సాగుతోంది. గత వారం రేటింగ్సే దారుణంగా ఉన్నాయంటే ఈ వారం పరిస్థితి మొత్తం చేజారిపోయేలా ఉంది. మొత్తానికి ఈ వారానికి బిగ్ బాస్ ఇచ్చిన కొంటె రాక్షసులు మంచి మనుషులు టాస్క్ పూర్తైంది. బెస్ట్ పర్ఫామెన్స్‌ కేటగిరీలో అరియానా, అవినాష్‌ను ఎనుకున్నారు. అయితే ఇదంతా కాసేపు పక్కనపెడితే ఇంట్లో ఉన్న ట్రాకుల గురించి ఇప్పుడు చర్చిద్దాం.

కొత్త ట్రాకులు..

కొత్త ట్రాకులు..

బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో ట్రాకులు గోల ఎక్కువైంది. ఎవరు ఎవరిని సెట్ చేసుకుంటున్నారు.. ఎప్పుడు ఎవరు ఎవరితో క్లోజ్‌గా ఉంటారో.. ఉంటున్నారో అర్థం కావడం లేదు. మొదట దగ్గరగా ఉన్న వారంతా దూరమవుతున్నారు. దూరంగా ఉన్న వారు దగ్గరవుతున్నారు. ఎవరు ఎలా పోయినా కూడా దివి అమ్మ రాజశేఖర్ మాత్రం మొదటి నుంచి బాగానే క్లోజ్‌గా ఉంటున్నారు.

అలా దగ్గర..

అలా దగ్గర..

దివి మార్నింగ్ మస్తీలో భాగంగా ఇంటి సభ్యులందరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పే టాస్క్ ఒకటి చేసింది. ఆ టాస్క్ ఇంటా బయటా దివికి ఫాలోయింగ్ పెరిగిపోయింది. అలా దివి చెప్పిన మాటలకు, అభిప్రాయాలకు అమ్మ రాజశేఖర్ ఫ్లాట్ అయిపోయాడు. అలా అప్పటి నుంచి వారిద్దరూ ఒక జట్టుగానే ఉంటున్నారు.

గత సీజన్‌లో అలా..

గత సీజన్‌లో అలా..

మూడో సీజన్‌లో బాబా భాస్కర్ శ్రీముఖి ఎంత క్లోజ్‌గా ఉండేవారో.. టాస్కుల్లో ఎంత బాగా సాయం చేసుకునేవారో అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి నాల్గో సీజన్‌లో అమ్మ రాజశేఖర్ దివిలు అలానే ఉంటున్నారు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఏర్పడింది. ఇదే విషయాన్ని బయటకు వచ్చిన కంటెస్టెంట్లు కూడా చెబుతున్నారు.

కుమార్ సాయి చెప్పేశాడు..

కుమార్ సాయి చెప్పేశాడు..

దివి ఎక్కువగా అమ్మ రాజశేఖర్ మీద డిపెండ్ అవుతుందని, ఆయన ప్రభావితం చేస్తున్నాడని కుమార్ సాయి చెప్పుకొచ్చాడు. ఆయనకు తోడు ఈమె.. ఈమెకు తోడు ఆయన ఉంటూ టాస్కులు ఆడుతున్నారు, ఇద్దరి మధ్య మంచి బంధం ఉందని కుమార్ సాయి పేర్కొన్నాడు.

పరువుతీసేసిన సోహెల్..

పరువుతీసేసిన సోహెల్..

ఇక నేటి ఎపిసోడ్‌లో దివి ముందు సోహెల్ అమ్మ రాజశేఖర్ పరువు తీసేసినట్టు కనిపిస్తున్నాయి. మార్నింగ్ పాటకు అమ్మ రాజశేఖర్ నేటి ఎపిసోడ్‌లో రెచ్చిపోయి డ్యాన్స్ వేసినట్టున్నాడు. ఇదే విషయాన్ని దివి ప్రస్థావించి ఈ రోజు బాగా చేశారు.. అని అడిగేసింది. నువ్ నన్ను ఫాలో అయ్యావా? అని తిరిగి సెటైర్ వేశాడు అమ్మ రాజవేఖర్. అలా అలా తిప్పుతూ ఉంటే ఎలా ఫాలో అయ్యేది అని దివి చెప్పింది.

Recommended Video

#RamaRajuForBheem : Komaram Bheem NTR Teaser, Jr.NTR RRR First Look | #BheemforRamaraju, #RRR
గర్ల్ ఫ్రెండ్ ముందు..

గర్ల్ ఫ్రెండ్ ముందు..

ఏమైనా ఈ ఏజ్‌లో మాస్టర్ బాగా చేశాడు కదా అని సోహెల్ పరువుదీశాడు. అలా అనేసరికి అక్కడి నుంచి దివి వెళ్లిపోయింది. ఆ మాట అనడంతో వెళ్లకపోయినా కూడా అమ్మ రాజశేఖర్ మాత్రం తెగ ఫీలయ్యాడు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే అలా ఎందుకురా మాట్లాడుతావ్ అని సోహెల్‌ను వేడుకున్నాడు. ఇక నుంచి చూడండి మిమ్మల్ని ఎలా లేపుతానో ఎంత హైట్‌లో ఉంచుతానో అని అమ్మ రాజశేఖర్‌కు సర్దిచెప్పాడు. మొత్తానికి అమ్మ రాజ శేఖర్ మనసులో మాత్రం కోరికలు బాగానే ఉన్నట్టున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X