అమ్మ రాజశేఖర్‌కు ఘోరమైన అవమానం.. మెడపట్టుకుని గెంటేసిన దేవీ నాగవల్లి!!

బిగ్‌బాస్ షోలో మొదటి వారం కాస్త గందరగోళంగా సాగింది. మోనాల్ ఏడుపులు, కరాటే కళ్యాణి అరుపులతో హౌస్ మొత్తం దద్దరిల్లింది. ఇక రెండో వారంలో కాస్త ఏడుపులు తగ్గాయి. కొద్దిపాటిగా అరుపులు కూడా తగ్గాయి. అందరూ కలిసి నవ్వించే ప్రయత్నం చేశారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కొత్త కొత్త ట్రాకులతో రెండో వారం కాస్త చప్పగానే సాగింది. అయితే ఈ వాతావరణాన్ని వేడెక్కిచేందుక నాగార్జున ఫుల్ ఫైర్ మీద వచ్చాడు.

రెండో వారం నామినేషన్..

రెండో వారం నామినేషన్..

రెండో వారానిని గానూ పెట్టిన నామినేష్ టాస్క్ అట్టర్ ఫ్లాప్ అయింది. కనీసం చర్చలు పెట్టకుండా ఎందుకు దిగిపోవాలో కూడా ఆలోచించకుండా త్యాగమూర్తుల్లా దిగిపోయారు అందరూ. ఈ క్రమంలో రెండో వారానికి సంబంధించిన నామినేషన్‌లో గంగవ్వ, నోయల్, అభిజీత్, మోనాల్, హారిక, అమ్మ రాజశేఖర్, సోహెల్, కరాటే కళ్యాణి, కుమార్ సాయిలు నామినేషన్‌లోకి వచ్చి పడ్డారు.

నాగార్జున ఇచ్చిపడేశాడు..

నాగార్జున ఇచ్చిపడేశాడు..


ఇక నాగార్జున ఒక్కొక్కరి తాట తీసినట్టు కనిపిస్తోంది. నామినేషన్ అంటే అంత జోక్‌గా ఉందని క్లాస్ పీకాడు. ఎవరికి వారే దిగిపోతున్నారు. పైగా ర్యాంకులు ఇచ్చుకుంటున్నారు.. సేఫ్ గేమ్ ఆడుదామని అనుకుంటున్నారా? అలా జరగనివ్వను అంటూ ఒక్కొక్కరి వార్నింగ్ ఇచ్చేశాడు.

ముసుగు తీయించేలా గేమ్..

ముసుగు తీయించేలా గేమ్..

ఇక హౌస్‌లో అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఇట్టే తెలిసిపోతోంది. అందుకే వారి నిజస్వరూపాలు బయటకు వచ్చేలా ఓ టాస్క్ ప్లాన్ చేశారు. ఎవరు జీరో ఎవరు హీరో అనే ఓ టాస్క్ పెట్టాడు..జీరో అనుకునే వాళ్లను గేట్ నుంచి బయటకు తోసేయండి అని నాగ్ ఆదేశించాడు.

అమ్మ రాజశేఖర్‌కు అవమానం..

అమ్మ రాజశేఖర్‌కు అవమానం..


ఇక ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ను దేవీ నాగవల్లి మెడపట్టుకుని మరీ గెంటేసింది. కామెడీ చేస్తే హీరోలా అని కౌంటర్ వేసింది. ఇక లాస్య సైతం మాస్టర్‌నే జీరో అని చెప్పి తోసేసింది. ఓవర్ యాక్షన్, అతి కామెడీ కూడా మంచిది కాదంటూ కారణాలు చెప్పారు. దీంతో అమ్మ రాజశేఖర్ కుమిలిపోయాడు.

Recommended Video

Bigg Boss Telugu 4: Noel sean Demands Sorry From Bigg Boss

దయచేసి పంపించండి..


నన్ను మెడ పట్టుకుని గెంటేసింది.. అలా చేయాలా.. ఈ అవమానం ఎందుకు సర్.. నేను వెళ్లిపోతా అని అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో కంటెస్టెంట్లందరూ వచ్చి మాస్టర్‌ను ఓదార్చారు. మరి అమ్మ రాజశేఖర్ కన్నీటికి దేవీ నాగవల్లి సమాధానం ఇస్తుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X