దివితో పులిహోర కలిపేస్తోన్న అమ్మ రాజశేఖర్.. సైట్ కొడుతూ వంటను పెంట చేసేశాడు!!
బిగ్‌బాస్ హౌస్‌లో ఒక్కమాట మాట్లాడకపోయినా, కనీసం ఐదు నిమిషాల పుటేజ్ లభించకపోయినా దివికి ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఒక్కోసారి ఏమీ చేయకుండా ఉంటేనే మంచిది, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనే మాటలకు అర్థాలుగా దివి నిలిచింది. మాట్లాడకుండా సైలెంట్‌గా దివికి ఫుల్ క్రేజ్ ఏర్పడటం, కనీసం వెళ్లేలోపు ఒక్కసారైనా ఆమె మాట్లాడుతుంటే చూడాలని ఉందంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.
Recommended Video

సైలెంట్‌గా ఉన్న దివి..
బిగ్‌బాస్ హౌస్‌లో అందరూ ఏదో ఒక సందర్భంలో మాట్లాడారు. మోనాల్ ఏడుస్తూ, కళ్యాణి అరుస్తూ, సూర్య కిరణ్ తొందరపెడుతూ ఇలా అందరూ ఏదో రకంగా పుటేజ్‌లో స్థానం సంపాదించుకున్నారు. కానీ దివి మాత్రం ఏ ఒక్కరోజు ఎక్స్‌ట్రాలు చేయలేదు. ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా తన ప్రపంచంలో తానే ఉంటూ వచ్చింది.

ఒక్క మాటైనా మాట్లాడు..
ఇక దివి అసలు మాట్లాడకపోవడం, కనిపించకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మీమ్స్, ట్రోల్స్ చేసే వారికి దివి బాగా చిక్కింది. కనబడుట లేదు, కనీసం వెళ్లేలోపు ఒక్కసారైనా మాట్లాడు అంటూ విపరీతంగా హల్చల్ చేశారు. ఒక్క మాటైనా మాట్లాడు అంటూ దివి ఫ్యాన్స్ కోరుకోగా బిగ్‌బాస్ వాటిని మన్నించాడు.

సపరేట్ టాస్క్..
దివి సైలెంట్‌గా ఉంటోందని బిగ్‌బాసే ఓ టాస్క్ ఇచ్చి ఆమెతో మాట్లాడించినట్టున్నాడు. ఇంటి సభ్యుల్లో ఏం గమనించావు, వారిలో ఎలాంటి మార్పులు ఉండాలని సూచిస్తావంటూ దివికి టాస్క్ ఇచ్చాడు. సైలెంట్‌గా ఉండే దివి హౌస్ మేట్స్‌ను అంతలా గమనిస్తుందని, గమనించినా అంత నిక్కచ్చిగా చెబుతుందని ఎవ్వరూ ఊహించలేదు. దివిలోని ఈ లక్షణానికి హౌస్ మేట్స్‌తో పాటు ఆడియన్స్ షాక్ అయ్యారు.

సూర్యకిరణ్, అమ్మ రాజశేఖర్ అలా..
దివి చెప్పిన అభిప్రాయాలతో అందరూ ఏకిభవించారు. ఇక సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్ దివితో కాస్త క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఇంత వరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నావని అనుకున్నాం కానీ నువ్ అంత బాగా అబ్జర్వ్ చేస్తున్నామని అనుకోలేదంటూ దివిపై ప్రశంసలు కురిపించాడు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అమ్మరాజశేఖర్ దివితో సరసాలు, సరదాలు చేస్తోన్నట్టు కనిపిస్తోంది.

దివికి సైట్ కొడుతున్న అమ్మ రాజశేఖర్..
మంచి క్యారెక్టర్ అందం ఉంది.. మనం బిగ్‌బాస్‌లో ఉన్నాం.. నువ్ హీరోయిన్ నేను హీరో..సరేనా అంటూ దివితో పులిహోర కలిపాడు అమ్మ రాజశేఖర్. ఇక దివి సైతం వంట చేస్తున్న మాస్టర్‌ను చూస్తూ.. నాకు వంట చేసే అబ్బాయిలంటే ఇష్టమని చెప్పడంతో సిగ్గుపడిపోయాడు. ఇక దివి ధ్యానంలో పడిపోయిన మాస్టర్.. కూరలో టీ పౌడర్ వేసేసి వంటను పెంట చేసేశాడు.


Click it and Unblock the Notifications











