Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లాస్య కంటే ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్.. యాంకర్ రవి కామెంట్స్ వైరల్
ప్రస్తుతం బిగ్ బాస్ షో ట్రెండింగ్‌లో ఉంది. చివరకు ఏం జరుగుతుందో అని అందరూ ఇప్పటినుంచి లెక్కలు కడుతున్నారు. ఇక మిగిలింది నాలుగు వారాలే. ఉన్నది ఎనిమిది మంది కంటెస్టెంట్లే. ఈ రోజు ఒక ఎలిమినేషన్ కానుంది. అది ఎవరన్నది శనివారం సాయంత్రమే లీకైంది. అయితే తాజాగా లాస్య గురించి యాంకర్ రవి మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో రవి తన టాప్ 5 కంటెస్టెంట్ల గురించి చెబుతూ లాస్యపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
స్పెషల్ ఇంటర్వ్యూ...
యాంకర్ రవి తన యూట్యూబ్ చానెల్ కోసం వర్షిణి, ఆమె సోదరి సౌజన్యను స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు. అందులో భాగంగా వర్షిణి లైఫ్ సీక్రెట్లెన్నో బయటకు వచ్చాయి. ఇంత వరకు మీడియా ముందుకు, ప్రేక్షకుల ముందుకు రాని వర్షిణి సోదరి సౌజన్య మొదటిసారి రవి కోసం కెమెరాముందుకువచ్చింది.
రవికి పెద్ద ఫ్యాన్స్..
అయితే యాంకర్ రవికి తామిద్దం పెద్ద ఫ్యాన్స్ అని, చిన్నతనం నుంచి కూడా రవి అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. సంథింగ్ స్పెషల్ ప్రోగ్రాం చేసే సమయంలో తమ సోదరుడు మీకు పెద్ద అభిమాని, పటాస్ షోతో మేము కూడా ఫ్యాన్స్ అయిపోయామని వర్షిణి, ఆమె సోదరి చెప్పుకొచ్చారు.
బిగ్ బాస్ షో గురించి..
అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్న సమయంలోనే వారి టాపిక్ బిగ్ బాస్ షో మీదకు మళ్లీంది. ఆ ఇంటర్వ్యూ వల్లే అభిజిత్ యాంకర్ రవికి ఉన్నరిలేషన్ బయట పడింది. ఆ ఇద్దరూ కజిన్ బ్రదర్స్ అవుతారని తెలిసింది. ఆ ఇంటర్వ్యూలో టాప్ 5 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకున్నారు.
రవి ఉద్దేశ్యంలో..
తన ఉద్దేశ్యంలో టాప్ 5 కంటెస్టెంట్లు కొందరి పేర్లు చెప్పాడు. అభిజిత్ సోహెల్ హారిక అవినాష్ అంటూ నలుగురి పేర్లు చెప్పాడు. కానీ ఐదో పేరులో లాస్య పేరు చెప్పకుండా.. అరియానా పేరు చెప్పారు. కానీ వర్షిణి, ఆమె సోదరి మాత్రం లాస్య పేరు చెప్పారు. తాను కూడా లాస్య అనుకున్నాను కానీ అరియానాయే ఆమె కాస్త్ స్ట్రాంగ్ అని అనుకుంటున్నాను అందుకే టాప్ 5లో చెప్పలేదని తెలిపాడు.
అప్పటి బంధం..
రవి లాస్య అనే పేరు వినని తెలుగు ప్రేక్షకులుండరు. స్టార్ మాలో వచ్చిన సంథింగ్ స్పెషల్ అనే షోతో ఈ జోడి బాగా పాపులర్ అయింది. ఆ తరువాత చాలా రోజులు కలిసి ఈవెంట్లు చేశారు. కానీ మధ్యలో గొడవలు రావడంతో ఇద్దరూ దూరమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు మాట్లాడుకున్నది ఎక్కడా కనిపించలేదు.
ఎలిమినేషన్..
అయితే రవి చెప్పింది నిజం కానుంది. ఎందుకంటే నేటి ఎపిసోడ్లో లాస్య ఎలిమినేట్ కానుంది. ఇప్పటికే లీకులు హోరెత్తిస్తున్నాయి. ఇక బయటకు వచ్చిన లాస్య ఎలాంటి కామెంట్లు చేస్తుందో.. ఆ మాటలు ఎంతటి సంచలనానికి దారి తీస్తాయో చూడాలి.