బిగ్ బాస్ 4: మరో హీరోను లాగుతున్న నాగార్జున.. ఏం చేసినా టీఆర్పీ కోసమే..
బిగ్ బాస్ 4 తెలుగుపై మొదట్లో ఉన్న అంచనాలు మధ్యమధ్యలో కాస్త తగ్గుతున్నాయనే చెప్పాలి. కంటెస్టెంట్స్ విషయంలో పొదుపుగా ఆలోచించి టాస్కులతో హైలెట్ చేయాలని అనుకున్నారు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న కంటెస్టెంట్స్ చాలా వరకు ఎంతో కొంత క్రేజ్ అయితే అందుకున్నారు గాని షోకి రేటింగ్ పెంచడంలో పెద్దగా సక్సెస్ అవ్వడం లేదు.

టాస్కులతో డోస్ పెంచినా కూడా..
ఫెస్టివల్ సమయంలో సమంత ఎంట్రీతో ఒక్కసారిగా రేటింగ్ పెరగడంతో మళ్ళీ షోకి బూస్ట్ వచ్చిందని అనుకున్నారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు కొనసాగలేదు. నాగార్జున వస్తేనే ఎంతో కొంత రేటింగ్ ముళ్ళు పెరుగుతోంది గాని నార్మల్ డేస్ లో సగానికి పైగా కిందకు పడిపోతున్నట్టు తెలుస్తోంది. గతంలో కంటే ఈ మధ్య టాస్కులతో డోస్ కూడా పెంచారు గాని ఏ మాత్రం ఉపయోగపడలేదు.

రెంటింగ్ కోసం ఎంత కష్టపడుతున్నారంటే..
అసలు మ్యాటర్ లోకి వస్తే ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులు షో రేటింగ్ పెరగడానికి వరుసగా సెలబ్రెటీలను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. సమంత, అఖిల్ తరువాత గతవారం సుమను లైన్ లోకి తెచ్చిన విషయం తెలిసిందే. నిజంగా బిగ్ బాస్ నిర్వాహకులు షో రెంటింగ్ కోసం ఎంత దిగజారి ప్రమోట్ చేస్తున్నారో ఆ రోజే అర్ధమయ్యింది. సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రోమోను బాగానే హైలెట్ చేశారు. కానీ అబద్ధమని చెప్పి కామెడీ చేయించారు.

అప్పుడే అర్ధమయ్యింది.. రెస్పాన్స్ ఎలా ఉందో..
సుమ వస్తే మిగతా షోలకు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏమవ్వాలి అనే ఆలోచన చాలా మందికి వచ్చింది. పైగా సుమకు అందులోకి వెళ్ళడానికి అవసరం ఏముంది? అనే సందేహాలతో బిగ్ బాస్ గుట్టు ముందే రట్టయ్యింది. ఆ విధంగా నిర్వాహకులు స్టంట్స్ వేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా రెస్పాన్స్ వస్తోంది అనేది. ఇక ఇప్పుడు మరో కొత్త ప్లాన్ ఏదో వేసినట్లు సమాచారం.

నాగ చైతన్య కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?
బిగ్ బాస్ లోకి మరో హీరో రాబోతున్నాడట. అక్కినేని నాగార్జున తన పెద్ద కుమారుడు నాగ చైతన్యను గెస్ట్ గా ఇన్వైట్ చేయబోతున్నట్లు సమాచారం. పనిలో పనిగా లవ్ స్టొరీ సినిమాను కూడా ప్రమోట్ చేసినట్లు ఉంటుందని నాగ చైతన్య కూల్ గా ఎంట్రీ ఇవ్వడానికి డిసైడ్ అయినట్లు టాక్ అయితే వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











