బయటకు వెళ్లిన తరువాత టచ్‌లో ఉందామన్నాడు, పెళ్లి కూడా.. అఖిల్ గుట్టు విప్పిన అరియానా

బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయినప్పుడు ఈ సారి పెద్దగా హిట్టయ్యే ఛాన్స్ లేదనే కామెంట్స్ చాలానే వచ్చాయి. పైగా ఎలిమినేషన్స్ లో కూడా తప్పు జరుగుతోందని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ మధ్య మధ్యలో కొన్ని ట్విస్టులు గొడవలు షోకి మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక లవ్ స్టోరీల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ట్రయాంగిల్ ప్రేమాయణం పెద్ద బూస్ట్ ఇవ్వగా మధ్య మధ్యలో అవినాష్, అరియానా కథ కూడా బాగానే బజ్ క్రియేట్ చేసింది. ఇక శనివారం ఎపిసోడ్ లో అరియానా ఒక సీక్రెట్ విషయాన్ని బయటపెట్టింది.

మాటకు మాట పెరుగుతోంది

మాటకు మాట పెరుగుతోంది

హౌజ్ లో కంటెస్టెంట్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నారు. టాస్కుల్లో భాగంగా కనికరం లేకుండా పోటీపడుతున్నారనే చెప్పాలి. ఎంత ఆప్యాయంగా మాట్లాడుకున్నా కూడా నామినేషన్స్ లోకి వచ్చేసరికి ఏ మాత్రం తగ్గడం లేదు. మాటకు మాట పెరుగుతోంది. ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు. తిట్టేవాళ్ళు తిట్టేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ అయితే ఒక కొత్త తరహా క్రేజ్ ను అందుకుంటోంది.

అవినాష్ కు చెమటలు పట్టించిన అరియానా

అవినాష్ కు చెమటలు పట్టించిన అరియానా

ఇక ప్రేమ పక్షుల మధ్య అప్పుడప్పుడు కొంత గ్యాప్ వస్తోన్న విషయం తెలిసిందే. పైగా అలకలు కోపాలు కామన్. శనివారం ఎపిసోడ్ లో కూడా అరియానా ఇచ్చిన డోస్ కు అవినాష్ షాక్ అయ్యాడు. గతంలో అఖిల్ తో ఆమె ప్రేమగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం అంటూ అవినాష్ కు చెమటలు పట్టించారు. ఇక శనివారం ఎపిసోడ్ లో కూడా అఖిల్ చెప్పిన విషయాలను బయటపెట్టేసింది అరియానా.

అఖిల్ పెళ్లి చేసుకుంటానని అన్నాడు: అరియానా

అఖిల్ పెళ్లి చేసుకుంటానని అన్నాడు: అరియానా

అరియానా మాట్లాడుతూ.. అఖిల్ నాతో ఏం చెప్పాడంటే.. నేను బ్యూటీఫుల్ గా ఉంటానని, నిన్ను ముందే ఎందుకు కలవలేదు. బయటకు వెళ్ళాక టచ్ లో ఉందాం. పెళ్లి కూడా చేసుకుందాం అనేలా మాట్లాడాడు.. అంటూ అరియానా వివరణ ఇచ్చింది. దీంతో హౌజ్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చూసావా అఖిల్ హౌజ్ లో ప్రతి ఒక్కరిని కవర్ చేస్తున్నాడు అంటూ మరోవైపు సోహెల్ కూడా కౌంటర్ వేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
ఇప్పుడు చెప్పు.. పులిహోర రాజా ఎవరు?

ఇప్పుడు చెప్పు.. పులిహోర రాజా ఎవరు?

హౌజ్ లో మొదటి నుంచి పులిహోర రాజా ట్యాగ్ ను అవినాష్ కె ఎక్కువగా తగిలించారు. ఇక శనివారం ఎపిసోడ్ లో అరియానా గుట్టు విప్పడంతో ఇప్పుడు చెప్పండి పులిహోర రాజా ఎవరని అవినాష్ గట్టిగా అరిచేశాడు. ఇక ఇద్దరి పెళ్లి చేసుకోండి చూడటానికి కూడా బావుంటారని కామెంట్ చేయగా.. దేవుడు ఎవరిని రాసిపెడితే వారే వస్తారని అరియానా అన్సార్ ఇచ్చింది. పర్వాలేదు నువ్వు రాసుకో అంటూ అవినాష్ మరో కౌంటర్ కూడా ఇచ్చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X