ఆగలేకపోతోన్న అరియానా.. హగ్గులతో ఉక్కిరిబిక్కిరి.. అభిజిత్‌ను పడేసేలానే ఉంది!!
బిగ్‌బాస్ షోలో ఎప్పుడు ఎవరు ఎందుకు దగ్గరవుతారు.. ఎందుకు దూరమవుతారో చెప్పలేం. ఇట్టే దగ్గరవుతారు.. ఇట్టే దూరమవుతారు. ఈ నాల్గో సీజన్‌లో మొదటి నుంచి అభిజిత్ అరియానాకు ఒకరంటే ఒకరికి పడదు. రెండు మూడు వారాలు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూనే వచ్చారు. ఒకరిపై ఒకరు కోపంగానే ఉన్నారు. అయితే ఐదో వారంలో సమీకరణాలు మారాయి. అభిజిత్ ఒక్క మాట అనడం, అరియానాను పిలవడం, కలిసి డ్యాన్సులు చేయడంతో అంతా మారిపోయింది.

చెత్త బుట్ట అంటూ..
మొదటి వారాంతంలో నాగార్జున ఇచ్చిన ఓ టాస్క్‌లో అభిజిత్‌ను చెత్తబుట్ట అంటూ అభివర్ణించింది. డస్ట్ బిన్ అనే మెడల్‌ను అభి మెడలో అరియానా వేసింది. అక్కడి నుంచి మొదలైన వీరిద్దరి మధ్య గొడవ ఐదో వారం వరకు ఏదో రకంగా కొనసాగుతూనే వచ్చింది. టాస్కుల విషయంలో వీరిద్దరి మధ్య ఏదో ఒక రకమైన విబేధాలు వచ్చేవి. ఇంట్లో వీరిద్దరి మధ్య అంత సఖ్యత కూడా లేదు.

ఆ టాస్క్ వల్ల..
నాగార్జున ఐదో వీకెండ్‌లో ఆడించిన ఆటలో అభిజిత్ వరల్డ్ ఫేమస్ లవర్ అయ్యాడు. ఓ పాటను ప్లే చేసి ఎవరితోనైనా డ్యాన్స్ చేయమని అవకాశమిచ్చాడు. అప్పుడు అందరూ మామూలుగా హారికను పిలుస్తాడని అనుకున్నారు. కానీ అరియానాను పిలిచి పెద్ద షాక్ ఇచ్చాడు.

సంబరపడ్డ అరియానా..
అలా అభిజిత్ పిలవడంతో అరియానే ఒకే సమయంలోషాకైంది సంబరపడింది. ఇక ఆ ఉత్సాహంలో అభితో డ్యాన్సు చేయకుండా మాట్లాడుకుంటూ గాల్లో తేలిపోయింది. నన్ను పిలుస్తావని అస్సలు అనుకోలేదంటూ తెగ ఎగ్జైట్ అయింది. మామూలుగా మా ఇద్దరి మధ్య అంత చనువు కూడా లేదని నాగార్జునతో చెప్పి అరియానా తన సంతోషాన్ని పంచుకుంది.
Recommended Video

ప్రేమగా కేక్..
అభిజిత్ బర్త్ డే సందర్బంగా అరియానా ప్రేమగా కేక్ తయారు చేసింది. కేక్ కట్ చేశాక అరియానా అభి నోట్లో కేక్ పెడుతూ తెగ సంబరపడిపోయింది. హ్యాపీ బర్త్ డే అభి అంటూ గట్టిగట్టిగా అరుస్తూ, అభిని హగ్గులతో కట్టిపడేసింది. చూస్తుంటే త్వరలోనే అభిని లైన్‌లో పెట్టేసేట్టు కనిపిస్తుంది. చూడాలి ఈ ట్రాక్ కూడా మళ్లీ గందరగోళంగా మారుతుందో ఏమో. అసలే ఇప్పటికీ ఈ ఇంట్లోనే ఏ ట్రాక్ పైనా ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు.


Click it and Unblock the Notifications