నీ బిర్యానీ నీకు కక్కి ఇవ్వాలా.. కొంప ముంచిన అరియానా కెప్టెన్సీ.. రివెంజ్ ప్లాన్

బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్స్ మధ్య పెరుగుతున్న గొడవలు రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి. గతంలో ఎప్పుడు లేని విదంగా టాస్క్ లలో ఒక్కొక్కరు వారి ఆలోచన విధానాన్ని చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక సోమవారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు కావడంతో పాత పగలు బయటపడ్డాయి. అరియానా కెప్టెన్ గా ఉన్నప్పుడు ఏ రేంజ్ లో చుక్కలు చూపించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు అదే ఆమె కొంప ముంచినట్లు అర్ధమయ్యింది.

రివెంజ్ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతోంది.

రివెంజ్ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతోంది.

హౌజ్ లో ఈ వారం ఎక్కువమంది టార్గెట్ చేసింది అరియానానే. అమ్మా రాజశేఖర్ వెళ్లిపోవడంతో 9 మంది ఉన్నారు. ఇక అవినాష్ తప్పితే మిగతా ఇంటి సభ్యులు మొత్తం అరియానానే టార్గెట్ చేశారు. ఆమెతో ఫ్రెండ్లీగా ఉండే మెహబూబ్ కూడా అరియానానే నామినేట్ చేశాడు. చూస్తుంటే అందరు ఒక్కసారిగా ఆమెపై రివెంజ్ ప్లాన్ చేసినట్లు అర్ధమవుతోంది.

తిన్న బిర్యానీ కక్కాలా..

తిన్న బిర్యానీ కక్కాలా..

అరియానా కెప్టెన్ గా సెలెక్ట్ అయినప్పుడు హౌజ్ మెంట్స్ కి ఏ రేంజ్ లో చుక్కలు చూపించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సోహైల్ ని అయితే ఒక ఆటాడుకుంది. అదే ఇప్పుడు ఆమెకు ఇబ్బందిగా మారింది. చేసిన బిర్యానీ బాగానే తిని ఆ తరువాత అరుస్తావ్ అనే మాటకు ఇప్పుడు తిన్న బిర్యానీ కక్కాలా అంటూ కౌంటర్ ఇచ్చింది అరియానా ఆ సంభాషణ హౌజ్ లో ఒక్కసారిగా వాతావరణాన్ని చేంజ్ చేసింది.

ఆ విషయాన్ని హైలెట్ చేసిన సోహైల్

ఆ విషయాన్ని హైలెట్ చేసిన సోహైల్

సోహైల్ అయితే అరియానా కెప్టెన్సీపై చాలా ఆగ్రహంతో ఉన్నట్లు అర్ధమయ్యింది. ముఖ్యంగా రెండవసారి స్నానం చేయమని పనిష్మెంట్ ఇచ్చినప్పుడు గొడవ పడిన సందర్భాన్ని కూడా ఎలిమినేషన్ లో బాగానే హైలెట్ చేశాడు. ఇక చిరునవ్వుతోనే మాయ చేసే లాస్య కూడా అరియానా కెప్టెన్సీపై నెగిటివ్ కామెంట్స్ చేసింది. అలాగే హారిక, అరియానాకు కాస్త మొండిగానే జవాబులు ఇచ్చి నామినేట్ చేసింది.

గేమ్ చేంజ్ అయ్యే అవకాశం..

గేమ్ చేంజ్ అయ్యే అవకాశం..

ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. హౌజ్ లో అవినాష్ తప్పితే మిగతా ఇంటి సభ్యులు మొత్తం అరియానా కెప్టెన్ గా ఉన్నప్పుడు టూ మచ్ గా బిహేవ్ చేసిందని కామెంట్ చేశారు. నిజానికి అరియానా కాస్త అతిగానే ప్రవర్తించినట్లు మొదట్లోనే సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. కానీ పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం కష్టం. ఆమెకు సింపతి తోడై జనాల నుంచి ఓట్ల ద్వారా సపోర్ట్ లభిస్తే.. గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. మరి టాస్క్ లలో అరియానా ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X