నువ్వు బతికుంటే చాలు అవినాష్.. నా కోసం వెయిట్ చేయవా: అరియానా ఎమోషనల్

బిగ్ బాస్ లో ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకోవడం చాలా కామన్ గా జరిగేదే. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎమోషనల్ గా ఎట్రాక్ట్ చేసే జోడీలు చాలానే ఉంటాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి బిగ్ బాస్ 4 తెలుగులో విభిన్నమైన జోడీలు దర్శనమిచ్చాయి. షో మొదట్లో మోనాల్ లవ్ ట్రాక్ తో హైలెట్ అయితే ఈ మధ్య అరియానా, అవినాష్ కాంబో డోస్ పెరిగింది. ఇద్దరు కూడా పరిస్థితుల ప్రభావం వల్ల ఇంకా దగ్గరవుతున్నట్లు అర్ధమవుతోంది.

అరియానా ఒంటరి పోరాటం

అరియానా ఒంటరి పోరాటం

అరియానా షో మొదలైనప్పుడు ఎక్కువ రోజులు ఉండడం చాలా కష్టమని అనుకున్నారు చాలా మంది. రెండో వీక్ లోనే ఆమె వెళ్లిపోతుందని అనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. మొత్తానికి ఎదో ఒక విధంగా ఒంటరి పోరాటం చేసి ఆడియెన్స్ లో తనకంటూ ఒక క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసుకుంటోంది. ఇక నామిమేషన్స్ లో కూడా ఆమె ఎక్కువగా నిలవకపోవడం విశేషం.

అవినాష్ వెళ్లిపోతాడేమోనని..

అవినాష్ వెళ్లిపోతాడేమోనని..

ఇక అవినాష్ విషయంలో ప్రతిసారి అరియానా ఇన్వాల్వ్ మెంట్ ఉంటోంది. అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అరియానా దూరం పెట్టడం లేదు. ఇక సోమవారం ఎలిమినేషన్ లో అమ్మా రాజశేఖర్ వెళ్లిపోతాడాని అందరూ భావించినప్పటికీ చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియదని కొంత ఆందోళన చెందింది అరియానా. అవినాష్ వెళ్లిపోతాడేమోనని గుండె బద్దలైనట్లు పర్ఫెమెన్స్ ఇచ్చింది.

మాస్టర్ కు అప్పుడే అర్ధమయ్యింది

మాస్టర్ కు అప్పుడే అర్ధమయ్యింది

గత వారమే ఎలిమినేషన్ ఎంతో ఉత్కంఠతో జరిగింది. ఇక ఈ వారం కూడా ఎలిమినేషన్ లో చివరగా మిగిలిన అమ్మా రాజశేఖర్ వెళ్లిపోక తప్పలేదు. మాస్టార్, అవినాష్ లలో ఎవరో ఒకరు గార్డెన్ ఏరియాలోని బూత్ లో నుంచి డైరెక్ట్ గా నాగ్ దగ్గరకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అయితే వెళ్లే క్రమంలో మాస్టర్ కి విషయం అర్ధమయ్యింది. వెళ్లిపోయేది నేనే అంటూ తేల్చి చెప్పేశాడు. ఇక ఎక్కడ అవినాష్ వెళ్లిపోతాడోనని కన్నీరు పెట్టుకుంది అరియానా.

Recommended Video

Bigg Boss 4 Telugu : ఈ వారం బిగ్ బాస్ నుంచి దివి ఎలిమినేటెడ్!
ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకు.

ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకు.


అరియానా ఈ విధంగా ఎమోషనల్ అయ్యింది.. ఓకేవేళ ఏం జరిగినా కూడా నా కోసం వెయిట్ చేయవా. రాగానే నిన్ను కలుస్తాను. ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించకు. ఏం జరిగినా కూడా వేరే నిర్ణయాలు తీసుకోకు. నా మీద ప్రామిస్ చెయ్. ఏం చేసుకోవద్దు. నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు బ్రతికుంటే చాలు. ప్లీజ్ అవినాష్.. అని అరియానా బోరున విలపించింది. అనంతరం అమ్మా రాజశేఖర్ వెళ్లిపోవడంతో ఒకవైపు బాధపడుతూనే హ్యాపీగా ఫీల్ అయ్యింది అరియానా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X