తన గొయ్యి తానే తీసుకుంటున్న అరియానా.. ఇలాగైతే ఫైనల్స్ కు వెళ్లడం కష్టమే
బిగ్ బాస్ హౌజ్ మొత్తానికి తుది దశకు చేరుకోవాడనికి అతి కొద్ది దూరంలో ఉంది. ఇక కంటెస్టెంట్స్ ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఇప్పుడు మాత్రం టాస్కులు మొదలైతే ఈజీగా శత్రువులైపోతారు. కానీ వీలైనంత వరకు ఈ సమయంలో ఒక్కరైనా క్లోజ్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. కానీ కొన్నిసార్లు ఆ ఒక్కరు కూడా అందుబాటులో ఉండరు. ఆ విధమైన చేదు అనుభవాలతో హౌజ్ నుంచి వెళ్లిపోయిన వారి సంఖ్య చాలానే ఉంది. ఇక ఇప్పుడు అరియానకు కాస్త ఎక్కువగా క్లోజ్ గా అవుతున్నాడు అనుకున్న సోహెల్ ఒక్కసారిగా విలన్ లా మారాడు.

ఎంతకైనా తెగిస్తారు
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ త్యాగాలు చేసినప్పటికీ కొన్నిసార్లు వారికి అదే పెద్ద మైనస్ కావచ్చు. ఇక ఇప్పుడున్న వారిలో అయితే త్యాగాలు చేయడానికి ఎవరికి అవకాశం లేదు. ఒక వేల అలాంటి అవకాశం వచ్చినా కూడా అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. కానీ నచ్చిన వాళ్ళ కోసం అవకాశం వస్తే ఇతరులను బలి చేయడానికి మాత్రం కొందరు వెనుకాడటం లేదు. మొన్న ఎలిమినేషన్ లో మోనాల్ ని స్వాప్ చేసిన హారిక..అభిని రక్షించిన విషయం తెలిసిందే.

నెక్స్ట్ వెళ్లిపోయేది అమ్మాయే..
ఇక అరియానా తీరు చూస్తుంటే ప్రస్తుతం డేంజర్ జోన్ లోనే ఉన్నట్లుగా టాక్ వస్తోంది. నెక్స్ట్ హౌజ్ నుంచి వెళ్లిపోయే వారిలో అమ్మాయే ఉన్నట్లు దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే అఖిల్ టిక్కెట్ టూ ఫైనలే లభించడంతో సేఫ్ అవ్వగా.. అభిజిత్ అయితే ఏకంగా టైటిల్ విన్నర్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ అయితే వస్తోంది. ఇక మిగతా వారితో పోలిస్తే సోహెల్ తన కంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సెట్ చేసుకున్నాడు.

గొడవలు ఎక్కువవుతున్నాయి
మోనాల్ , హారిక సంగతి పక్కనపెడితే అరియానా ఈ మధ్య ఓవర్ గా వ్యవహరిస్తోందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్స్ కూడా ఎక్కువయ్యాయి. అవినాష్ వెళ్లిన తరువాత అఖిల్ వైపు ట్రాక్ మార్చిన అరియానా సోహెల్ కింగ్ అయినప్పుడు గట్టిగా అరిచేస్తూ నానా బీభత్సం చేసింది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో అయితే టాస్క్ లో భాగంగా మోనాల్ ప్రవర్తించిన తీరుకు గొడవ పడింది.
Recommended Video

కయ్యానికి కాలు దువ్వుతున్న అరియానా
ఇక ఈ రోజు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో సోహెల్ తో మరోసారి గట్టిగానే కయ్యానికి కాలు దువ్వినాట్లు తెలుస్తోంది. హారిక, అభి కూల్ గా వారి గేమ్ వారు ఆడుతూ వెళుతుంటే అరియానా మాత్రం గోడవలతో ముందుకు వెలుతోంది. ఆఖరికి అవినాష్ తో కూడా వెళ్లే ముందు గట్టిగానే గోడవపడింది. ఈ విధంగా అరియానా రోజురోజుకు తన స్థాయిని కొంత తగ్గించుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఈ ఎఫెక్ట్ ఆమెపై చూపిస్తుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











