నాతో గోడవ పడినందుకు మంచిదైంది సోహెల్.. నిజస్వరూపాన్ని బయటపెట్టి షాక్ ఇచ్చిన అరియానా
బిగ్ బాస్ అంటేనే మనుషుల అసలు రంగులను బయటకు తీసేదని అందరికి తెలిసిన విషయమే. ఎవరైనా సరే పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉండాలి. ఆటలో భాగంగా గొడవలు ఎన్నో ఆలోచనలను కలిగిస్తాయి. ఈ క్రమంలో ఎవరు బ్యాడ్ ఎవరు గుడ్ అని చెప్పడం కష్టం. సోమవారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య చిచ్చు పెడుతూనే వారి అసలు రంగులను కూడా బయటపెట్టాడు. అరియానా సోహెల్ కు నవ్వుతూ కృతజ్ఞతలు చెప్పడం విశేషం.

గొడవలు జరగాలి కాబట్టి..
బిగ్ బాస్ హౌజ్ లో గొడవలు ఎన్ని జరిగినా కూడా కొన్ని సందర్భాల్లో నవ్వుతూ మాట్లాడుకొక తప్పదు. ఒకవేళ కంటెస్టెంట్స్ మధ్య అలకలు కోపాలు ఉంటే మళ్ళీ వారిద్దరిని కలిపేందుకు బిగ్ బాస్ ఎదో ఒక టాస్క్ అయితే ఇస్తుంటాడు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగాలి కాబట్టి. ఇక సోమవారం కూడా ఓపెన్ గా మనసులో ఉన్న అసలు విషయాలను పాజిటివ్ గా బయటపెట్టించే ప్రయత్నం చేసినా బిగ్ బాస్ చివరికి చిచ్చు పెట్టె రూల్ ను తెచ్చాడు.

సోహెల్ కు థ్యాంక్స్ చెప్పిన అరియానా
ఇంటి సభ్యులు అందరూ కూడా విజేత అవ్వడానిక అర్హత లేని కంటెస్టెంట్స్ గురించి చెప్పి సరైన కారణం కూడా చెప్పాలని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇక అంతకంటే ముందు ఒకరి వల్ల బయటపడిన నిజస్వరూపాన్ని కూడా ముసుగు ధరించి చెప్పాలని బిగ్ బాస్ వివరణ ఇవ్వడంతో అరియానా ఎవరు ఊహించని విధంగా సోహెల్ కు థ్యాంక్స్ చెప్పడం కాస్త షాక్ కు గురి చేసింది.

ఆ గొడవ మంచిదే..
బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుంచి కూడా అరియానా, సోహెల్ పైకి నవ్వుకుంటూనే ఉంటున్నప్పటికీ లోలోపల మాత్రం వారికి శత్రుత్వం ఏ రేంజ్ లో ఉందొ మొన్నటి టాస్క్ లో చాలా ఈజీగా అర్ధమయ్యింది. బొమ్మ కోసం అరియానా చేసిన రచ్చకు సోహెల్ కూడా గట్టిగానే కౌంటర్స్ ఇచ్చాడు. అయితే ఆ కోపం బయటపడటం మంచిదే అయ్యిందని అరియానా సోహెల్ కు కృతజ్ఞతలు చెప్పడం విశేషం.

అతనితో ఓపెన్ నా ఫీలింగ్స్ చెప్పుకున్నాను
సోహెల్ అలా చేసి ఉండకపోతే నేను నా నిజస్వరూపాన్ని బయటకు చూపించేదాన్ని కాదేమో అంటూ అరియానా నవ్వుతూ మాట్లాడేసింది. అవినాష్ తో కూడా చాలా ఓపెన్ గా ఉన్నాను అంటూ కెమెరా ముందు మాట్లాడకుండా ఉండడానికి అతనితో చాలా సార్లు ఓపెన్ గా నా ఫీలింగ్స్ ను షేర్ చేసుకున్నానని తెలిపింది.
Recommended Video

బిగ్ బాస్ లో.. అదే పెద్ద మైనెస్
అసలు నిస్జస్వరూపాలను బయట పెట్టిన అనంతరం కంటెస్టెంట్స్ మళ్ళీ ఎప్పటిలనే పెంట చేసుకున్నట్లు అనిపించింది. తరువాత అర్హత టాపిక్ వచ్చేసరికి కంటెస్టెంట్స్ మధ్య కోపాలు కొంత పెరుగుతూ వచ్చాయి. చాలా సందర్భాల్లో ఎలిమినేషన్ లోనే కంటెస్టెంట్స్ మధ్య అర్హతకు సంబంధించిన గొడవలు చాలానే వచ్చాయి. అర్హత లేని వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు నేను తప్ప అంటూ ఓక రేంజ్ లో పెర్ఫెమెన్స్ ఇచ్చారు. కానీ కొందరికి అదే పెద్ద మైనెస్ అయ్యిందనే టాక్ వచ్చింది. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కు అర్హత లేని వాళ్ళ గురించి చెప్పాలని కారణంతో క్లారిటీ ఇవ్వాలని అనడంతో ఎక్కువమంది అరియానాపైనే కామెంట్స్ చేశారు.


Click it and Unblock the Notifications











