twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆంటీ అంటే నీకు యాంటీ అవుతా.. సోహైల్‌కు లాస్య కౌంటర్

    |

    బిగ్ బాస్ సీజన్ 4 తెలుగు మొత్తానికి ఒక ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. గతంతో పోలిస్తే ఈ మధ్య కంటెస్టెంట్స్ అసలైన గేమ్ ఆడుతున్నారని అర్ధమవుతోంది. అవసరమైన టైమ్ లో ఎలా ఉండాలి.. ఎలిమినేషన్ సమయానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంలో చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఇక అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ మధ్య చోటు చేసుకుంటున్న కొన్ని సరదా సన్నివేశాలు ఆడియెన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి.

    సోహైల్, లాస్య మధ్య..ఫన్నీ గొడవ

    సోహైల్, లాస్య మధ్య..ఫన్నీ గొడవ

    ఇక మంగళవారం 66వ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ ఫస్ట్ హాఫ్ సరదాగా మాటలతో మొదలయ్యి ఇంటర్వెల్ బ్యాంగ్ లో టాస్క్ తో ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ గోడవలని పక్కన పెడితే ముందుగా సోహైల్, లాస్య మధ్య చోటు చేసుకున్న ఒక సరదా సన్నివేశం బాగానే ఆకట్టుకుంది. లస్యను సోహైల్ ఆంటీ ఆంటీ అంటూ ఆట పట్టించాడు. మధ్యలో అరియానా కూడా ఇన్వాల్వ్ అయ్యింది.

    ఆంటీ అంటే బాగుండదు

    ఆంటీ అంటే బాగుండదు

    మెహబూబ్ ని పిలుస్తూ అరేయ్ లాస్య అక్క పిలుస్తోంది రా అంటూ కామెంట్ చేస్తూనే.. బిగ్ బాస్ లో ఒక ఆంటీ అని అనేశాడు. దీంతో లాస్య ఒక్క సెకన్ షాక్ అయ్యింది. నేను ఆంటీ ఏంటి అని వాదనకు దిగింది. అనంతరం సోహైల్ నువ్వే అన్నావ్ కదా నిన్న అంటూ గుర్తు చేయడంతో నాకు నేను ఎప్పుడైనా అనుకోవచ్చు కానీ నువ్వు అనకూడదు అంటూ మరో కౌంటర్ ఇచ్చింది లాస్య.

    ఫోకస్ అవ్వాలని అరియానా ఆరాటం

    ఫోకస్ అవ్వాలని అరియానా ఆరాటం

    ఇక వారి మధ్య జరుగుతున్న సరదా సన్నివేశంలో అరియానా ఫోకస్ అవ్వాలని అనుకుందో ఏమో గాని మధ్యలోకి వచ్చేసింది. సోహైల్ అంకుల్ అంటూ పరువు తీసే ప్రయత్నం చేసింది. కానీ సోహైల్ అప్పుడే ఆమెపై సెటైర్ వేసేశాడు. హే.. నువ్ ఉండవే.. మధ్యలో రాకు అంటూ వెక్కిరించాడు గాని అరియానా వెనక్కి తగ్గలేదు. ఇక ఆ గోడవ కాస్త ఎక్కువవుతోందని అనుకున్న తరుణంలో లాస్య ఎండ్ కార్డ్ పెట్టేసింది.

    Recommended Video

    Bigg Boss Telugu 4 : Episode 13 PROMO Review | తెలుగు బిగ్‌బాసా? లేదా ఇంగ్లీష్, హిందీ బిగ్‌బాసా?
    ఆంటీ అంటే యాంటీ అయిపోతా..

    ఆంటీ అంటే యాంటీ అయిపోతా..

    నువ్వు నన్ను ఆంటీ అంటే యాంటీ అయిపోతా చూడు మరి అంటూ లాస్య కౌంటర్ ఇవ్వడంతో సోహైల్ దెబ్బకు సైలెంట్ అయ్యాడు. ఎందుకంటే సోహైల్, లస్యతో గోరింటాకు రేంజ్ లో సిస్టర్ సెంటిమెంటును క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి చివరికి ఆ సరదా సీన్ లో డ్రాప్ అవ్వగా తప్పలేదు. కానీ బిగ్ బాస్ లో ఎమోషన్స్ కి తావుండదని నిన్న అఖిల్ చేసిన రచ్చతో అర్ధమయ్యింది. దీంతో ఎప్పుడో ఒకసారి సోహైల్, లాస్య మధ్య కూడా అలాంటి సీన్ కూడా క్రియేట్ కావచ్చని తెలుస్తోంది.

    English summary
    Whether or not she received such a craze as an anchor, Ariana gave herself the title of Bold Girl. The hustle and bustle in this young girl's house, which was seen with the entry of Bigg Boss 4th season, is not normal. Trying to impress with the daily comedy task is not going to be a workout in the range as expected either. There have already been a lot of satires on her voice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X