ఆమెకు అన్నీ తెలుసు.. కావాలనే అభిజిత్ అఖిల్‌తో అలా.. మోనాల్‌పై అవినాష్ కామెంట్స్

బిగ్ బాస్ షోలో నాల్గో సీజన్ మొత్తంలో దాదాపు జరిగిన గొడవలన్నీ కూడా మోనాల్ మూలానే అయి ఉంటాయి. అభిజిత్ మోనాల్ అఖిల్ చుట్టే నాల్గో సీజన్ తిరగ్గా మరీ ముఖ్యంగా మోనాల్‌ను సెంటర్ చేసే కథ అంతా నడిచింది. కాదు కాదు నడిచేలా చేసుకుందట. అవినాష్ మోనాల్ స్ట్రాటజీ గురించి అసలు గుట్టు విప్పాడు. ఇంట్లో గొడవలు జరిగాలి.. అది తన గురించే జరగాలని భావించే అలా చేస్తోందంటూ మోనాల్‌పై అవినాష్ కామెంట్స్ చేశాడు.

అభిజిత్ మాటలు...

అభిజిత్ మాటలు...


అభిజిత్ గత వారం మోనాల్‌ను నామినేట్ చేస్తూ ఓ మాట అన్నాడు. మోనాల్ ఎప్పుడూ కూడా ఓ స్టాండ్ తీసుకోలేదు అందుకే నామినేట్ చేస్తున్నాని చెప్పాడు. ఆమె ఒకవేళ స్టాండ్ తీసుకొని ఉంటే.. ఇంత దూరం వచ్చేది కాదని, ఇన్ని గొడవలు అయ్యేవి కావని అభిజిత్ చెప్పుకొచ్చాడు. అచ్చం అలాగే అవినాష్ బయటకు వచ్చాక మాట్లాడుతున్నాడు.

 ఎలిమినేషన్ షాక్..

ఎలిమినేషన్ షాక్..

నేను మోనాల్ నామినేషన్స్‌లో ఉన్నాం అంటే.. ఎవరైనా మోనాల్ ఎలిమినేట్ అవుతుందని అనుకుంటారు తప్పితే అవినాష్ ఎలిమినేట్ అవుతాడని అనుకోరని అవినాష్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు హౌస్‌లో మిగిలిన ఆరుగురికి కూడా తెలుసు.. నేను ఎలా ఆడతానో.. మోనాల్ గేమ్ ఎలా ఆడుతుందో.. ఈ సడెన్ షాక్ నమ్మలేకపోతున్నా. అమ్మతోడుగా నమ్మలేకపోతున్నా అంటూ తన ఎలిమినేషన్‌పై అవినాష్ కామెంట్ చేశాడు.

ఎందుకు ఓట్లు..

ఎందుకు ఓట్లు..

ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూని తప్పుపట్టడం లేదు.. నేను ఇక్కడకు వచ్చానంటే వాళ్ల వల్లే.. మరి ప్రేక్షకులు ఏవిధంగా మోనాల్‌కి ఓట్లు వేశారో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశాడు. నా వరకూ అయితే నేను ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచాను అని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Nagarjuna Akkineni To Fans On Apple Products
అదే గేమ్ ప్లాన్..

అదే గేమ్ ప్లాన్..

తనపై ఇష్యూ జరుగుతుందని మోనాల్‌కు బాగా తెలుసు.. వీకెండ్‌లో గొడవ అవుతున్నప్పుడు దేనికోసం గొడవ అవుతుందో అన్నీ ఆమెకు తెలుసు అని అవినాష్ మోనాల్‌ గుట్టు విప్పాడు. ఆమె స్టాండ్ తీసుకుని పాయింట్ ఇదీ అని చెప్తే గొడవ ఫినిష్ అయ్యేదని కానీ చెప్పదని అవినాష్ అసలు విషయం బయటపెట్టాడు. తన కోసం డిస్కస్ చేయాలి.. టాపిక్ తనదే అయ్యి ఉండాలనేది ఆమె గేమ్ ప్లాన్ అదే ఆమె స్ట్రాటజీ అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X